న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (న్యూస్‌టైమ్): భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ వాతావరణ అంచనా కేంద్రం ఏప్రిల్ 16 నుంచి 19వ తేదీ వరకు దేశంలో వాతావరణ పరిస్థితులపై తాజా బులెటిన్ విడుదల చేసింది. జాతీయ వాతావరణ అంచనా కేంద్రం అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో)లతో కూడిన వడగళ్ళ వానలు కురుస్తాయి. మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర, యానాం, ఒడిశా, ఛత్తీస్‌ఘర్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడినవానలు కురుస్తాయి.

రాయలసీమ, మరాఠ్వాడలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు (గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో) వర్షాలు కురుస్తాయి. జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, విదర్భ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కోస్తా ఆంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షదీవుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహె, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. అలాగే, హర్యానా, సౌరాష్ట్ర, కుచ్ ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

శుక్రవారం (ఏప్రిల్ 16న) జమ్మూకాశ్మీర్, లడఖ్,గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, వడగళ్ళు, గాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌ఘర్, ఝార్ఖండ్, ఉప గంగ పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరెలా, మాహెలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులు (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో)లతో కూడిన వర్షాలు కురుస్తాయి. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, విదర్భ, ఉప హిమాలయ ప్రాంత పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్య మహారాష్ట్ర, మరత్వడ, ఒడిశా, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, లక్షదీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోస్తా, దక్షిణ కర్ణాటక, కేరెలా, మాహె, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాగా, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక తుపాను/ఈదురుగాలులు (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం) వీచే అవకాశం వుంది.

శనివారం (ఏప్రిల్ 17న) ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, వడగళ్ళు, గాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, పంజాబ్‌లలోని కొన్ని ప్రదేశాలలో మెరుపు, వడగళ్ళు, గాలులు (గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో)లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలోని కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన గాలులు (గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో) వీస్తాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, చండీఘర్, ఢిల్లీ, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్, కేరళ, మాహేలలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు గాలులతో (గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురుస్తుంది.

విదర్భ, బీహార్, అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ కోస్తా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, లక్షదీవుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. అలాగే, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోఇసుక తుపాను గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

ఆదివారం (ఏప్రిల్ 18న) ఉత్తరారఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, గాలులతో (గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురిసే అవకాశం వుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్- బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో వర్షాలు కురిసే అవకాశం వుంది. బీహార్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్ష దీవులలోని కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహేలలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదవుతుంది. అదే రోజు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక తుపాను గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

సోమవారం (ఏప్రిల్ 19న) ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలోని కొన్ని ప్రాంతాల్లో మీదుగా వివిక్త ప్రదేశాలలో మెరుపులు, గాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురుస్తుంది. గంగా పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్‌లలోని కొన్ని ప్రదేశాలలో మెరుపులు, గాలులతో (గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.