న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (న్యూస్‌టైమ్): భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండి)కి చెందిన తుపాను హెచ్చ‌రిక కేంద్రం స‌మాచారం ప్రకారం తాజా ఉప‌గ్ర‌హ చిత్రాలు, నౌక‌లు, వాతావ‌ర‌ణ బెలూన్ల నుంచి స‌మాచారాన్ని ప‌రిశీలించి చూసిన‌పుడు నిన్న స్ప‌ష్టంగా తూర్పు మ‌ధ్య‌బంగాళాఖాతం, పొరుగున ఉన్న ఆగ్నేయ‌ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం, ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం వ‌ద్ద వాయుగుండంగా మారి ఆదివారం ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది ఉత్త‌రాన 15.3 డిగ్రీలు, తూర్పున 86.5 డిగ్రీల రేఖాంశం వ‌ద్ద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నానికి ద‌క్షిణ ఆగ్నేయంగా, కాకినాడ‌కు 490 కిలోమీట‌ర్ల ఆగ్నేయంగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ర్సాపూర్‌కు 520 కిలోమీట‌ర్ల తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృత‌మై ఉంది.

ఇది మ‌రింత బ‌ల‌ప‌డి రాగ‌ల 24 గంట‌ల‌లో తీవ్ర తుపానుగా మారేఅవ‌కాశంఉంది. ఇది ప‌శ్చిమ వాయ‌వ్య‌దిశ‌గా క‌దిలి న‌ర్సాపూర్‌, విశాఖ‌ప‌ట్నం తీరం మ‌ధ్య సోమవారం రాత్రి తీరం దాటే అవ‌కాశంఉంది.