చరిత్రలో ఈ రోజు/మే 22

0
12 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్ధాంతం ప్రకారం సంవత్సరంలో ఈరోజు 142వ రోజు (లీపు సంవత్సరంలో 143వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 223 రోజులు మిగిలి ఉన్నాయి.

సంఘటనలు…

 • 0334 : బి.సి. అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్3ని, టర్కీలోని గ్రేనికస్ అనే చోట ఓడించాడు.
 • 0337 : కాన్ స్టాంటిన్ ది గ్రేట్ మరణించాడు. ఇతడు, తన రాజ్యంలో, క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేసాడు.
 • 1216 : ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలు పెట్టాయి.
 • 1455 : 30 సంవత్సరాల వార్స్ ఆఫ్ రోజెస్ యుద్ధం మొదలైన రోజు.
 • 1570 : మొట్టమొదటి ఆధునిక అట్లాస్, 70 పటాలు (మేప్స్)తో అబ్రహం ఓర్టెలియస్, అనే, ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ (పటాల రూపకర్త) బెల్జియంలో ప్రచురించాడు.
 • 1761 : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొదటి జీవిత బీమా పాలసీని ఫిలడెల్ఫియాలో జారీ చేసారు.
 • 1841 : ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం)కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ (వంగిన భాగాలతో తయారు చేసింది. పడక కుర్చీ, (రిక్లైనింగ్ చైర్) కోసం ఒక పేటెంట్ పొందాడు.
 • 1849 : అబ్రహం లింకన్, తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్)‌ కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
 • 1972 : సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా మారింది.
 • 2004 : భారత 13వ ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమితుడయ్యాడు. (14వ లోక్‌సభ)
 • 2008 : నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
 • 2009 : భారత 13వ ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమితుడయ్యాడు. (15వ లోక్‌సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
 • 2010 : మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.

జననాలు…

 • 1783 : విలియం స్టర్జియన్, మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
 • 1822 : పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
 • 1828 : ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె, ఆధునిక నేత్ర వైద్యాన్ని అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
 • 1859 : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
 • 1944 : రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)

మరణాలు…

 • 1885 : విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)
 • 1960 : మేడవరం సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
 • 2002 : మందులు. కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
 • 2010 : వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
 • 2015 : పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
 • 2019 : చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు. (జ.1940)

పండుగలు, జాతీయ దినాలు…

 • అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here