చరిత్రలో ఈరోజు/మే 19

0
7 వీక్షకులు

‘గ్రెగొరియన్‌’ క్యాలెండర్‌ సిద్ధాంతం ప్రకారం సంవత్సరంలో ఈరోజు 139వ రోజు (లీపు సంవత్సరంలో 140వ రోజు). సంవత్సరాంతానికి ఇంకా 226 రోజులు మిగిలి ఉన్నాయి.

సంఘటనలు…

  • 1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేదీ (ఇది జలాంతర్గామి కాదు. విశాఖపట్నంలోని సముద్రతీరాన ఏర్పాటుచేసిన నావికా దళ కార్యాలయం)
  • 1927 : సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.
  • 1944 : అడాల్ఫ్ హిట్లర్‌పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.
  • 1990 : మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.
  • 1991 : సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.

జననాలు…

  • 1890 : హో చి మిన్, అమెరికాను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు. ఇతని మరణానంతరం, వియత్నాం రాజధాని పేరును హో చి మిన్ సిటీగా మార్చారు.
  • 1894 : గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979)
  • 1908 : మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956)
  • 1908 : జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.
  • 1910 : నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
  • 1913 : నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి.
  • 1915 : మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.
  • 1934 : పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.
  • 1946 : చెర్, అమెరికన్ నటి.

మరణాలు…

  • 1970 : కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894)
  • 1952 : బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)
  • 1985 : పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)
  • 2008 : విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here