అనధికార లేఅవుట్లపై హెచ్ఎండీఏ చర్యలు

0
7 వీక్షకులు

హైదరాబాద్, జనవరి 27 (న్యూస్‌టైమ్): హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని అనుమతిలేని, అనధికార లేఅవుట్లను గుర్తించి తగు చర్యలు తీసుకొనడానికి ఈ నెల 29 నుండి మే 5వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ప్లానింగ్ అధికారులు, ప్లానింగ్ అధికారులు వారి పరిధిలోని అనుమతి లేని లేఅవుట్లను గుర్తించి, సంబంధిత యజమానులు/డెవలపర్స్‌కు నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. మే 10వ తేదీ తరువాత అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, లేఅవుట్లను తొలగించడం జరుగుతుందని, ఏదైనా అక్రమ లేఅవుట్లను గుర్తించిన ఎడల, నిరోధించని సదరు సంబంధిత అధికారులపై కూడా క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు నష్టపోకుండా ఉండడానికి హెచ్.యం.డి.ఎ. అధికారిక వెబ్‌సైట్‌లో అనుమతి పొందినది, లేనిది సరి చూచుకొని అనుమతి వున్న లేఅవుట్లలోని ప్లాట్లనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. సబ్ రిజిష్టార్లు కూడా అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్లను రిజిష్టరు చేయరాదని అర్వింద్ కుమార్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here