సంసారంలోనే కాదు… శృంగారంలోనూ…

0
11 వీక్షకులు

చెన్నై, మార్చి 20 (న్యూస్‌టైమ్): తన గర్ల్‌ఫ్రెండ్ చాలా అందగత్తెట. దీంతో అన్నివేళలా తనమాటే నెగ్గాలని తాపత్రయపడుతుందట. అలాగే, పడక గదిలో కూడా తనుచెప్పినట్టే సెక్స్ చేయాలని ఒత్తిడి చేస్తోందట. ముఖ్యంగా ఆమె కోరుకున్న భంగిమల్లోనే శృంగారంలో పాల్గొనాలని ఆర్డర్ వేస్తుందట. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా తనతో పోట్లాటకు దిగుతుందట. ఏం చేయాలో అర్థంకావడం లేదని ఓ యువకుడు ఈ మధ్య సెక్సాలజిస్టును కలిశాడు. దానికి డాక్టర్ ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తిగానే ఉంది.

ఇలాంటి సమస్య చాలా మంది భర్తలకు ఎదురవుతుంది. దీనికి కారణం ఆమె అందానికి పడిపోయి ఆదిలోనే ఆమెకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీన్ని ఆమె తనకు అనుకూలంగా మార్చుకుని మిమ్మలను చులకనగా చూడటం ప్రారంభించింది. ఫలితంగానే పడక గదిలో ఆమె ఆర్డర్లు వేసే పరిస్థితి ఉత్పన్నమైంది.

అయితే దాంపత్య జీవితంలో భార్య పెత్తనం చెలాయించినా లేక భర్త ఆధిపత్యం చెలాయించినా సంసార జీవితంలో చిక్కులు తప్పవు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఏ మేరకు ఏ బాధ్యత నిర్వహించాలనేది స్త్రీపురుషులిద్దరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన ఉండరాదు. మరో యువకుడిదీ ఇలాంటి సమస్యే. తమది హైదరాబాద్‌ అట. ఇటీవల తమ ఇంటిపక్కనే ఓ కుటుంబం అద్దెకు వచ్చిందట. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా స్మార్ట్‌గా, చూడచక్కగా ఉన్నారట. అలా రోజులు గడిచేకొద్దీ ఆమె తనకు పరిచయమైందట. దీంతో ఆమె వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తన కళ్లు ఆమెవైపు మళ్లసాగాయట. ఈ విషయాన్ని తన భార్య గుర్తించి ఆమెను ఎందుకు దొంగచూపులు చూస్తున్నారు నాలో ఏం తక్కువా అంటూ నన్ను నిలదీసిందట కూడా.

అదేసమయంలో పక్కింటావిడ కూడా తనపై ఫిర్యాదు చేసిందట. దీంతో తప భార్య తనకు ప్రతి రోజూ క్లాస్ పీకుతోందట. ఆమెను మళ్లీ తన దారికి తెచ్చుకోవడమెలా? అంటూ ఆ యువకుడి ప్రశ్న. అసలు పక్కింటావిడను ఆ యువకుడు ఏ ఉద్దేశ్యంతో చూశాడో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆయన భార్య అనుమానం పూర్తిగా తొలగిపోయాలంటే భార్యతో మరింత సన్నిహితంగా మెలగాల్సిందే. పైగా ఆమె ప్రేమను పొందటం కోసం మరింత ప్రేమను చూపించాలి కూడా.

ఆమె తప్ప మరెవ్వరు తన మనస్సులో లేరనే భావం ఆమెలో కలగించేలా ప్రయత్నించాలి. అలాగే, పక్కింటావిడ మళ్లీ తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయకుండా జాగ్రత్త వహించాలి. చాడీలు చెప్పే స్త్రీల పట్ల మరింత జాగ్రత్త వహించాలి. ఆమెను వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు దొంగ చూపులు చూడకుండా జాగ్రత్త వహించాలి.