ఆర్ఎన్ఐ ఈ-ఫైలింగ్ డాష్‌బోర్డు హోం పేజీ

2019-2020 సంవత్సరానికి వార్షిక నివేదికను (Annual return) సమర్పించడానికి ఆర్ఎన్ఐ Online Window (http://rniefiling.gov.in)అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన ఆగస్టు 31 గడువును అధికారులు సెప్టెంబర్ 15 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్సు ఫర్ ఇండియా (RNI)కు ఏటా సమర్పించాల్సిన వార్షిక నివేదిక (Annual Statement (Form-II))కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గడువులోగా Annual Statement E-Filing చేయాల్సిన బాధ్యత ప్రచురణకర్తదే.

మా ద్వారా ఇక ఉచిత సబ్‌మిషన్ అంటూ ఏమీ ఉండదు. అలాగని ఇతరుల మాదిరిగా మేము ప్రచురణకర్తల నుంచి డబ్బులు వసూలుచేసి ఈ పనిచేసిపెట్టేది కూడా ఉండదని దయచేసి గమనించ మనవి.

ప్రచురణకర్తలు తమకు అందుబాటులో ఉన్న వేరే మార్గాల ద్వారా ఈ పని పూర్తిచేయించుకోవాలని సూచిస్తున్నాము. ఎన్నడూలేనంతగా ఇప్పుడు RNI E-filing వెబ్‌సైట్‌పై వత్తిడి పెరిగింది. ఫలితంగా Annual Statement Online Submission సమయంలో సాంతకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ సమస్యను అధిగమించే క్రమంలో చివరి నిమిషం వరకూ వేచిచూడకుండా ఎప్పటి దరఖాస్తులను అప్పుడు సబ్‌మిట్ చేసే ఏర్పాట్లు మా చందాదారులకు చేయడం జరిగింది.

E-filing online registration దగ్గర నుంచి submission వరకూ ఈసారి RNI కొత్త ఆప్షన్లు, హై సెక్యూర్డ్ ఆప్షన్లతో కూడిన అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి Registration సమయంలో RNI Reg. No.తో పాటు Title codeను సైతం ఎంటర్ చేయమని అడుగుతోంది. మనం ఇచ్చే చలామణీలో ఉన్న ఈ-మెయిల్, మొబైల్ నెంబర్లకు వచ్చే OTP (One Time Password) ఆధారంగా తదుపరి అప్లికేషన్ పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో E-filing విషయంలో గతం కంటే కొద్దిపాటి సమస్యలు, భర్తీ చేసే సమయం ఎక్కువయ్యాయనిపిస్తోంది.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రచురణకర్తలు సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తిచేయించుకుంటారని సూచిస్తున్నాము. ఎవరిపైనా ఆధారపడే అవసరం లేకుండా, పైసా ఖర్చుచేయకుండా స్వయంంగా Annual Statementను Onlineలో Submit చేసుకోవడం చాలా సులభం.

ఇక, గతంలో మాదిరిగా మాన్యువల్ కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించేది లేదని ఆర్ఎన్ఐ అధికారులు నాలుగేళ్ల క్రితమే స్పష్టంచేసి, Annual Statement E-filing చేయని ప్రచురణకర్తలపై (అపరాధ రుసుమును 500 నుంచి 1000 రూపాయలకు పెంచడం, Defaulters జాబితాలో పేర్లను బహిర్గం చేయడం, RNI రిజిస్ట్రేషన్‌లోని డేటా మార్పులు, చేర్పుల నిమిత్తం తిరిగి దరఖాస్తుచేసినప్పుడు దీన్నో సాకుగా చూపించి కొర్రీలు వేయడం సహా DAVP Empanelment నిలిపివేత లేదా సస్పెన్షన్‌లో పెట్టడం తదితర) చర్యలకు దిగుతున్నవేళ Annual Statement E-filing ఎంత కీలకమో విజ్ఞులైన ప్రచురణకర్తలకు ప్రత్యేకంచి చెప్పాల్సిన పనిలేదు.

పూర్తి వివరాలకు ఆర్ఎన్ఐ అధికారిక వెబ్‌సైట్‌ www.rni.nic.inను సందర్శించవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన లింక్‌ల ద్వారా ఆయా వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఇక, ఆర్ఎన్ఐ వద్ద నమోదైన పత్రికలన్నీ వార్షిక నివేదికల్ని విధిగా సమర్పించాల్సిందే. (http://www.rni.nic.in/all_page/frm_pub_communication.aspx) అది ప్రచురణకర్తల కర్తవ్యం కూడా. ఒకవేళ నిబంధనల ప్రకారం అలా తమ బాధ్యతను నిర్వర్తించని ప్రచురణకర్త పీఆర్‌బీ (PRB act) చట్ట ప్రకారం నేరస్తుడికిందే లెక్క. కనీసం వార్షిక నివేదిక కూడా సమర్పించని వారు ప్రచురణకర్తగా అర్హత కోల్పోతాడన్న అంశం అదే PRB చట్టం (act) As per Section 19D of the PRB Actలోనే ఉంది. కానీ, ఈ విషయాన్ని గుర్తించేది ఎంత మంది? దేశవ్యాప్తంగా ఆర్ఎన్ఐ జారీచేసిన జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రచురణలు కూడా చాలా మేరకు నేటికీ డిఫాల్టర్ల జాబితాలో ఉన్నాయి. గడువు దాటాక టైటిల్ మనుగడలో ఉంటుందన్న గ్యారంటీ ఎలాగూ లేదని స్పష్టమవుతున్న నేపథ్యంలో దయచేసి ఈ అవకాశాన్ని డిఫాల్టర్లయిన ప్రచురణకర్తలంతా సద్వినియోగం చేసుకుంటారని సలహా. ఇప్పటికే మీ పత్రిక ఆర్ఎన్ఐ వద్ద నమోదితమై ఉంటే తప్పనిసరిగా రిటర్న్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందని గుర్తించ మనవి.

ఇది వరకే నివేదిక సమర్పించినట్లయితే తమ వార్షిక నివేదిక (Annual return)ను సమర్పిస్తే తదుపరి కష్టాలు (టైటిల్ డీ బ్లాక్ కావడం లేదా ఇతరత్రా సమస్యలు) తప్పుతాయి.

ప్రింట్ మీడియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రచురణకర్తల సౌలభ్యాన్ని, ఆర్ధిక పరిస్థితుల్నీ దృష్టిలో పెట్టుకుని ‘న్యూస్‌టైమ్’ ఏడాదికి కేవలం నామమాత్రపు ఖర్చుతో యాన్యువల్ రిటర్న్ (Annual return)ను ఆర్ఎన్ఐకి పంపించే వెసులుబాటు కల్పించిందని చెప్పడానకి సంతోషిస్తున్నాము. అది కూడా కేవలం సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. డిఫాల్టర్ పబ్లిషర్లు ఎవరున్నా నేరుగా మా నుంచి ఈ సర్వీసును పొందవచ్చు. లేదా నేరుగా కూడా ప్రచురణకర్తలు పూర్తి ఉచితంగా తమ నివేదికను తామే ఆన్‌లైన్‌లో ఈ-ఫైలింగ్ ద్వారా సమర్పించుకోవచ్చు.

With regards,
Team NT
https://www.agency.newstime.in
https://www.newstime.in
editor@newstime.in
newstimedaily@gmail.com
6300795484 & 9390556171