కార్మికుల కోసం ఇఫ్టూ పోరు

0
6 వీక్షకులు

ఏలూరు, మే 27 (న్యూస్‌టైమ్): ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రవం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ భారత దేశ కార్మిక వర్గంపై ప్రధాన నరేంద్రమోడీ సర్కరముప్పేట దాడికి పూనుకుందన్నారు.

కార్మికుల హక్కుల కోసం, చట్టాల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, త్యాగాలు, రక్తతర్పణలు, ప్రాణాలు అర్పించి కాపాడుకున్న హక్కులను హరించే విధంగా చట్ట సవరణలు చేపట్టారన్నారు. 12 గంటల పని దినలు తీసుకురావాలని 44 కోట్లను 4 కోట్లుగా చెయ్యాలనే మోడీ చర్యలను ఖండిస్తున్నామన్నారు. భారత దేశ కార్మికవర్గం జీవించే హక్కులను కాలరాస్తు, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్ట సవరణలు చేస్తూ కార్మికులపై ముప్పేట దాడులకు మోడీ సర్కార్ మోదీ సర్కార్ పూనుకుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మికవర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ నేపధ్యంలో జరుగుచున్న వుద్యమాలకు మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదులు సంఘటిత పోరాటంలో భాగస్వామ్యం కావాలన్నారు. హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చెయ్యాలని, వలస కూలీలకు చట్ట తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ కార్మికవర్గం ఐక్య వుద్యవలు చేపట్టాలని వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయూ నాయకులు యర్రా శ్రీను, గడసాల రాంబాబు, మంగం అప్పారావు, పల్లి గంగరాజు, మీసాల రవణ, అరుణోదయ అప్పారావు, జి. గంగాధరరావు, సందకం అప్పారావు, జి. నాగేశ్వరరావు, ఎల్. గణేష్ తదితరులు నాయకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here