ఆర్ఎన్ఐ యాన్యువల్ రిటర్న్ ఈ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ

Advisory: ATTENTION PUBLISHERS..

Submission of Annual Statement?..

Submission of Annual Statement in Form II is mandatory under the Press and Registration of Books Act, 1867 and Registration of Newspaper Central Rules 1956, for each registered publications (newspapers/periodicals) on or before 31st May of every year.

Non submission of Annual Statement may not only attract fine under the PRB Act, 1867 but will also lead to publication not being included by DAVP in its panel for granting advertisements.

by RNI, New Delhi… (www.rni.nic.in)

ప్రచురణకర్తలకు ముఖ్య గమనిక

ఎప్పటి మాదిరిగానే ‘న్యూస్‌టైమ్’ ద్వారా RNI Annual Statements E-filing చేయడానికి ఏర్పాట్లు చేయడమైనదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (RNI)కు ఏటా సమర్పించాల్సిన వార్షిక నివేదిక (Annual Statement (Form-II))కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మా చందాదారుల కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. అయితే, గడువులోగా Annual Statement E-Filing చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రచురణకర్తదేనని గుర్తించాలి.

ప్రచురణకర్తలు మాతో సహా తమకు అందుబాటులో ఉన్న వేరే ఇతర మార్గాల ద్వారా కూడా ఈ పని పూర్తిచేయించుకోవచ్చని తెలియజేస్తున్నాము. ఎన్నడూలేనంతగా ఇప్పుడు RNI E-filing వెబ్‌సైట్‌పై వత్తిడి పెరిగింది. ఫలితంగా Annual Statement Online Submission సమయంలో సాంతకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే క్రమంలో చివరి నిమిషం వరకూ వేచిచూడకుండా ఎప్పటి దరఖాస్తులను అప్పుడు సబ్‌మిట్ చేసే ఏర్పాట్లు మా చందాదారులకు చేయడం జరిగింది.

E-filing online registration దగ్గర నుంచి submission వరకూ ఈసారి RNI కొత్త ఆప్షన్లు, హై సెక్యూర్డ్ ఆప్షన్లతో కూడిన అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచింది. మనం ఇచ్చే చలామణీలో ఉన్న ఈ-మెయిల్, మొబైల్ నెంబర్లకు వచ్చే OTP (One Time Password) ఆధారంగా తదుపరి అప్లికేషన్ పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో E-filing విషయంలో గతం కంటే కొద్దిపాటి సమస్యలు, భర్తీ చేసే సమయం ఎక్కువయ్యాయనిపిస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రచురణకర్తలు సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తిచేయించుకుంటారని సూచిస్తున్నాము. ఎవరిపైనా ఆధారపడే అవసరం లేకుండా, పైసా ఖర్చుచేయకుండా స్వయంంగా Annual Statementను Onlineలో Submit చేసుకోవడం చాలా సులభం.

ఇక, గతంలో మాదిరిగా మాన్యువల్ కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించేది లేదని ఆర్ఎన్ఐ అధికారులు రెండేళ్ల క్రితమే స్పష్టంచేసి, Annual Statement E-filing చేయని ప్రచురణకర్తలపై (అపరాద రుసుమును 500 నుంచి 1000 రూపాయలకు పెంచడం, Defaulters జాబితాలో పేర్లను బహిర్గం చేయడం, RNI రిజిస్ట్రేషన్‌లోని డేటా మార్పులు, చేర్పుల నిమిత్తం తిరిగి దరఖాస్తుచేసినప్పుడు దీన్నో సాకుగా చూపించి కొర్రీలు వేయడం సహా DAVP Empanelment నిలిపివేత లేదా సస్పెన్షన్‌లో పెట్టడం తదితర) చర్యలకు దిగుతున్నవేళ Annual Statement E-filing ఎంత కీలకమో విజ్ఞులైన ప్రచురణకర్తలకు ప్రత్యేకంచి చెప్పాల్సిన పనిలేదు.

పూర్తి వివరాలకు ఆర్ఎన్ఐ అధికారిక వెబ్‌సైట్‌ www.rni.nic.inను సందర్శించవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన లింక్‌ల ద్వారా ఆయా వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.

‘న్యూస్‌టైమ్’ చందాదారులకు వార్షిక నివేదిక (యాన్యువల్ స్టేట్‌మెంట్) పూరించడం పూర్తి ఉచితం కాబట్టి, దీని కోసం గడువులోగా సర్వీసు పొందిన వారికి మాత్రమే ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఆ తదుపరి ఉచితంగా కాకుండా CA Cerficate, E-Filing చార్జీలను ప్రచురణకర్తలే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మా వద్ద చందాదారులైన ప్రచురణకర్తలకు ఇదే ఆహ్వానంగా భావించి తమ తమ డిక్లరేషన్ కాపీలను మా మెయిల్‌కు సంతకం చేసి, స్టాంప్ వేసి పంపించగలరని విజ్ఞప్తి. ఇక్కడ అందుబాటులో ఉంచిన రెండు డిక్లరేషన్లలో మొదటిది చార్టెడ్ అకౌంటెంట్ (CA) ధ్రువీకరించాల్సింది http://rniefiling.gov.in/DocFiles/RNI%20-ChartedAccounted.pdf కాగా, రెండోది కేవలం పబ్లిషర్ డిక్లరేషన్ మాత్రమే. http://rniefiling.gov.in/DocFiles/RNI%20-%20PublisherDeclaration.pdf కేవలం 2000 కాపీల లోపు సర్క్యులేషన్ కలిగిన ప్రచురణకర్తలు CA ధ్రువీకరణతో నిమిత్తం లేకుండా పబ్లిషర్ డిక్లరేషన్ ఒక్కదానిపై సంతకం చేసి స్కాన్ చేసిన కాపీని మాకు పంపిస్తే సరిపోతుంది. అదే 2000 కాపీల పైన సర్క్యులేషన్ కలిగిన వారు మాత్రం CA డిక్లరేషన్ కాపీపై ప్రచురణకర్త సంతకం చేసి పంపిస్తే, దానిపై మా ఆధీకృత చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మేమే ఉచితంగా ధ్రువీకరించి స్టేట్‌మెంట్ ఆన్‌లైన్‌లో పంపించడం జరుగుతుంది. మా చందాదారులు ఈ ప్రక్రియ కోసం పైసా కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదని మరోమారు తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే నేరుగా ఈ 6300795484 లేదా 9390556171 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

యాన్యువల్ రిటర్న్ దాఖలుచేయని పత్రికలపై వేటు…

The Registrar of Newspapers For India (RNI)కు ఏటా సమర్పించాల్సిన వార్షిక నివేదిక (యాన్యువల్ రిటర్న్) అవసరం, ప్రాధాన్యత గురించి గతంలో అనేక సందర్భాలలో ప్రచురణకర్తలకు వివరించినా చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. తత్ఫలితం గతంలో DAVP కేవలం యాన్యువల్ రిటర్న్‌ దాఖలు చేయని పత్రికలపై వేటు వేయడం చాలా మంది ప్రచురణకర్తలకు తెలిసిందే.

రెగ్యులారిటీ కారణాన్ని చూపించి దాదాపు పత్రికలపై సస్పెన్షన్ వేటు వేసిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (DAVP- DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY) తర్వాత యాన్యువల్ రిటర్న్ దాఖలు చేయని ప్రచురణలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆర్ఎన్ఐ యాన్యువల్ రిటర్న్‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తున్నందు వల్ల సంబంధిత కాపీని ప్రింట్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీ-2016 కాజ్-15 (నోట్-2) ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో DAVPకి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని ప్రచురణలను ఎంపానల్‌మెంట్ జాబితా నుంచి సస్పెండ్ చేసే అధికారం ప్రింట్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీ-2016లోని కాజ్-25 (సీ) ప్రకారం DAVPకి ఉంది.

కేవలం యాన్యువల్ రిటర్న్ దాఖలు చేయకపోవడం వల్ల ఎంతో శ్రమపడి సాధించుకున్న ఎంపానల్‌మెంట్ పోవడం దురదృష్టకరం. దయచేసి ప్రచురణకర్తలు ఇప్పటికైనా గడువులోగా ఆర్ఎన్ఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని గడువులోగా రిటర్న్ సబ్‌మిట్ చేయాలని సలహా.

ధన్యవాదాలతో,
Team న్యూస్‌టైమ్
9390556171 లేదా 9989745557
visit us; www.agency.newstime.in
mail us; ntagencyservice@gmail.com