హత్యకు దారితీసిన అక్రమ సంబంధం

4409

విశాఖపట్నం, జులై 14 (న్యూస్‌టైమ్): వివాహితతో పెట్టుకున్న అక్రమ సంబంధం చివరికి రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని నడిరోడ్డుపై హతమార్చిన ఉదంతం విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ శివారు చోడవరం మెయిన్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం మూడు గంటలకు చోడవరం మెయిన్ రోడ్ ఐలాండ్ వైన్‌షాప్ ఎదురుగా కోన రాజేష్(22)పై సత్తిబాబు అనే యువకుడు కత్తితో దాడిచేసి హతమార్చాడు.

పిలావారితోట ప్రాంతానికి చెందిన రాజేష్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాజేష్‌ను బెన్నవోలు గ్రామానికి చెందిన పండూరి సత్తిబాబు అలియాస్ ప్రభాష్ (28) హత్యచేశాడు. కాపు సామాజిక వర్గానికి చెందిన సత్తిబాబు భార్యతో రాజేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానమే ఈ దారుణానికి కారణమైంది. మోటర్ సైకిల్‌పై వచ్చిన సత్తిబాబు వేరే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేష్‌పై కత్తితో దాడిచేశాడు. మెడ మీద కసితో నరికి ప్రాణాలు తీశాడు.

హంతకుడు సత్తిబాబు

సంఘటన గురించి తెలిసిన వెంటనే నర్సీపట్నం అదనపు ఎస్పీ అరిఫ్ హఫీజ్, డి.ఎస్.పి వివేకానంద, అనకాపల్లి రూరల్ సీఐ పీవీవీ నర్సింహారావు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హత్య చేసిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.