ఆంగ్ల భాష నైపుణ్యంతో మెరుగైన అవకాశాలు

281
  • అమెరికాలో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫెలో విక్కీ ఏ హేల్‌

విశాఖపట్నం, నవంబర్ 10 (న్యూస్‌టైమ్): ఆంగ్ల భాష నైపుణ్యంతో మెరుగైన అవకాశాలు లభిస్తాయని అమెరికాలోని యుస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫెలో విక్కీ ఏ హేల్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ జర్నలిజం విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించడం వలన విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా రాణించడం సాధ్యపడుతుందన్నారు.

జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్థన్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని అనుసంధానించే భాషగా నేడు ఆంగ్లం నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనే నిర్ణయం శుభ పరిణామమన్నారు. అట్టడుగు వర్గాలకు సైతం ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు.

అనంతరం విక్సీ ఏ హేల్‌ను సత్కరించారు. కార్యక్రమంలో సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రైనర్‌ డాక్టర్‌ చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌, డాక్టర్‌ జి.కె.డి ప్రసాద రావు, డాక్టర్‌ కె.రామ చందర్‌, కె.సంతోష్‌ కుమార్‌, డాక్టర్‌ కె.శాంతి, డాక్టర్‌ ఏ.సాయి బాల, బి.వి.కె చైతన్య తదితరులు పాల్గొన్నారు.