కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌ల మంత్రి పీయూష్ గోయ‌ల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 (న్యూస్‌టైమ్): విదేశీ ప్ర‌త్య‌క్ష‌ పెట్టుబ‌డుల నియ‌మాల‌ను స‌డ‌లించి, వివిధ రంగాల‌కు ద్వారాల‌ను ప్ర‌భుత్వం తెర‌వ‌నున్న నేప‌థ్యంలో భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస్ట్రేలియాకు చాలా అవ‌కాశం ఉంద‌ని కేంద్ర రైల్వేలు, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌ల మంత్రి పీయూష్ గోయ‌ల్ శుక్ర‌వారం చెప్పారు. భార‌త్‌- ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఆర్ధిక‌, వాణిజ్య సంబంధాల‌ను పెంచ‌డం అన్న అంశంపై సిఐఐ స‌ద‌స్సును ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ఆహార త‌యారీ ప్ర‌క్రియ (ఫుడ్ ప్రాసెసింగ్‌) అద‌న‌పు విలువలో అధిక పెట్టుబ‌డుల‌ను పెట్టేందుకు వ్య‌వ‌సాయ రంగం ద్వారాల‌ను తెరిచామ‌‌ని ఆయ‌న అన్నారు. భార‌త్‌- ఆస్ట్రేలియా వ్యూహ నివేదికను ఆయ‌న ఆవిష్కరించారు.

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతం, అనుకూలం చేసి మ‌ద్ద‌తునిచ్చేందుకు తాము నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. అంత‌రిక్షం, అణు ఇంధ‌నం, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తులు వంటి రంగాలు మ‌న ప‌ర‌స్ప‌ర లావాదేవీల కోసం మంచి అవ‌కాశాల‌ను అందించ‌నున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అంకురిస్తున్న రంగాలైన ర‌క్ష‌ణ‌, క్రీడ‌లు, జౌళి, జౌళి రూప‌క‌ల్ప‌న‌, డిజిట‌ల్ గేమింగ్, యానిమేష‌న్‌, నీటి నిర్వ‌హ‌ణ‌, వాణిజ్య నౌకా నిర్మాణం, అంత‌రిక్ష భాగ‌స్వామ్యం, విద్యా రంగంలో డిజిట‌ల్ ఒడంబ‌డిక‌లు వంటివి త‌మ వాణిజ్య సంబంధాల‌ను స‌మ‌తుల్యం చేసేందుకు త‌మ కృషికి హామీ ఇస్తాయి.

త‌నంగా తీసుకువ‌చ్చిన కార్మ‌క సంస్క‌ర‌ణ‌లు, కార్మిక నిబంధ‌న‌లకు, స‌ర‌ళీక‌రించిన ఉపాధికి నూత‌న వాతావ‌ర‌ణాన్ని సానుకూలం చేస్తాయ‌ని గోయ‌ల్ చెప్పారు. టూరిజం వంటి రంగాలు నూత‌న చ‌ట్రం కింద భార‌త్‌లో అనేక ఉద్యోగాల‌ను సృష్టించి, భార‌త్‌లో టూరిజం ప్రాజెక్టుల‌ను మ‌రింత సాధ్యం చేస్తాయ‌న్నారు. భార‌త్‌లోని రైతుల‌కు మ‌రింత ఆదాయాలు పొందేలా చేయాల‌నుకుంటున్నామ‌ని, ఇది త‌మ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తికి అద‌న‌పు విలువ‌ను సాధ్యం చేయ‌డ‌మే కాక‌, అంత‌ర్జాతీయ స‌మాజ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు మిగిలిన ప్ర‌పంచంతో ప‌ర‌స్ప‌ర చ‌ర్యను సాధ్యం చేస్తుంద‌న్నారు. గోయ‌ల్ 3 బి ల‌క్ష్యాల‌ను నిర్ధిష్టంగా ప్ర‌స్తావిస్తూ బిగ్గ‌ర్ ట్రేడ్ బాస్కెట్ – బెట‌ర్ ట్రేడ్ బాస్కెట్ – స‌మ‌తుల వాణిజ్య సంబంధాల ద్వారా మ‌న వాణిజ్య సంబంధాల‌లో భారీ విశేష వృద్ధిని చూడ‌గ‌లుగుతామ‌న్నారు.

మ‌హమ్మారి నేప‌థ్యంలో ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను తిరిగి సాధార‌ణ మార్గంలోకి తెచ్చేందుకు ప‌రిశ్ర‌మ‌ల‌పై పెడుతున్న దృష్టి మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం వి-ఆకారంలో కోలుకుంటోంద‌న్నారు. కోవిడ్‌-19 సంక్షోభం విసిరిన స‌వాలును భార‌త్ త‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత స‌ర‌ళీక‌రించి, భార‌త్‌తో వ్యాపారం చేయ‌డం మ‌రింత సులువు చేసేందుకు ఉప‌యోగించుకుంటోంద‌ని మంత్రి చెప్పారు. ముఖ్యంగా దాదాపు అన్ని రంగాల‌లో 100% విదేశీ పెట్టుబ‌డుల యాంత్రిక మార్గం ద్వారా వ‌చ్చే అవ‌కాశం ఉన్న కార‌ణంగా నేటి బ‌హిరంగ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లో, త‌మ‌ది కూడాఒక‌ట‌ని అన్నారు.

స‌ర‌ఫ‌రా లంకెను మ‌రింత బ‌హుముఖం చేయ‌డం అన్న‌ది పార‌ద‌ర్శ‌క లేని ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్ట‌డం స‌హా స‌‌ర‌ఫ‌రా ఇన్‌పుట్ల‌కు సంబంధించి ఉన్న రిస్కుల‌ను నిర్వ‌హించ‌డం కీల‌క‌మ‌ని గోయ‌ల్ చెప్పారు. వ్యూహాత్మ‌క రంగంలో భార‌త్ – ఆస్ట్రేలియా మ‌రింత స‌న్నిహితంగా క‌లిసి ప‌ని చేస్తున్నాయ‌ని – అది మ‌ల‌బార్ ఎక్స‌ర్‌సైజులు, క్వాడ్ గ్రూపింగులు స‌హా ప‌లు వ్యూహాత్మ‌క రంగాల‌లో భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉన్నాయ‌న్నారు. రానున్న సంవ‌త్స‌రాల‌లో ఈ స‌హ‌కారం త‌మ ఆర్థిక భాగ‌స్వామ్యంగా త‌ర్జ‌మా చెందుతుంద‌ని చెప్పారు. ఆస్ట్రేలియా వ్య‌హ‌ నివేదిక వంటివి త‌మ వాణిజ్యం, ఆర్థిక విధానాలు స‌మ‌రేఖ‌లోకి తెచ్చి ఆ వ్యూహ నివేదిక‌ను అమ‌లు చేసేందుకు కృషి చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. స‌మ‌గ్ర‌మైన ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందం కోసం జ‌రిగే చ‌ర్చ‌ల‌లో గుదిగుచ్చేందుకు తాము స‌హ‌కారం కోసం మంచి రంగాల‌ను క‌నుగొన‌గ‌ల‌మ‌ని చెప్పారు.