న్యూఢిల్లీ, జనవరి 9 (న్యూస్‌టైమ్): భారత్‌లో క్రమేణా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్న ధోరణి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కేవలం 18,139 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. స్థిరంగా కొత్త కేసులు పతనం చెందుతుండడంతో మొత్తం క్రియాశీల సంఖ్యల్లో కూడా తరుగుదల కనిపిస్తోంది. వీటి సంఖ్య దేశవ్యాప్తంగా ఈ రోజు 2,25,449గా నమోదయ్యాయి. కాబట్టి మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 2.16%కి తగ్గింది. గత 24 గుంతల్లో 20,539 మంది కోలుకోవడంతో, నికరంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,634కి తగ్గాయి. గత 24 గంటల్లో క్రియాశీల కేసుల సంఖ్యలో మార్పును కేంద్రం ఇవాళ జారీచేసిన ప్రకటన సూచిస్తుంది.

307 కొత్త కేసులతో కలిసి మహారాష్ట్ర అత్యధిక పాజిటివ్ మార్పును నమోదు చేసుకుంది. కేరళలో మాత్రం 613 కేసులు తగ్గి గరిష్ఠ స్థాయిలో నెగెటివ్ మార్పు చోటుచేసుకుంది. మొత్తం రికవరీలు ఇటీవల ఒక కోటి మార్కును దాటాయి. రోజువారీ రికవరీలలో స్థిరమైన పెరుగుదలతో, ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది ఈ రోజు 10,037,398 వద్ద ఉంది. రికవరీ రేటు కూడా 96.39 శాతానికి పెరిగింది. కొత్తగా కోలుకున్న కేసులలో 79.96% 10 రాష్ట్రాలు/యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించబడింది. కేరళ గరిష్టంగా ఒకే రోజు అత్యధిక రికవరీలను అంటే 5,639 కొత్తగా కోలుకున్న వారి సంఖ్య నమోదయింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,350 మంది కోలుకున్నారు, పశ్చిమ బెంగాల్‌లో 1,295 మంది ఉన్నారు.

కొత్త వాటిలో 81.22% కేసులు 10 రాష్ట్రాలు, యుటిల నుండి వచ్చినవి. కేరళలో రోజువారీ అత్యధికంగా 5,051 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 3,729, ఛత్తీస్గఢ్ 1,010 కొత్త కేసులతో ఉన్నాయి. గత 24 గంటల్లో 234 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కొత్త మరణాలలో 76.50% ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు (72) సంభవించాయి. కేరళలో 25, ఢిల్లీలో 19 రోజువారీ మరణాలు నమోదయ్యాయి. మిలియన్ జనాభాకి 109 మంది చొప్పున మరణాలు భారత్‌లో నమోదయ్యాయి. మిలియన్ జనాభాలో మరణాల సంఖ్య 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా తక్కువ ఉన్నాయి.

మరోవైపు 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మిలియన్ జనాభాకి గాను మరణాల సంఖ్య జాతీయ సగటు కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీ అత్యధికంగా మిలియన్ మందికి 569 మరణాలు సంభవించాయి. యూకేలో మొదట గుర్తించిన కొత్త కరోనా వైరస్ కొత్త స్ట్రైన్ వ్యాపించిన వారి సంఖ్య ఇండియాలో 82గా నమోదయింది.