కరోనా క‌ట్ట‌డికి ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ విరాళం

56

విజయనగరం, మార్చి 28 (న్యూస్‌టైమ్): ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న క‌రోనా వ్యాధిని నియంత్రించే చ‌ర్య‌ల‌కు త‌మ‌వంతు సాయంగా ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ రూ.50వేల విరాళాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు ఆ క్ల‌బ్ ప్ర‌తినిధులు రూ.50వేల విలువైన‌ చెక్కును ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి పంపాల‌ని కోరుతూ, జిల్లా క‌లెక్ట‌ర్‌కు శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో క్ల‌బ్ అధ్య‌క్షులు టి.సుస్మిత‌ శ్రీ‌ధ‌ర్‌, కార్య‌ద‌ర్శి జి.మాధురీల‌త పాల్గొన్నారు. వీరిని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్‌లాల్ అభినందించారు.