ఏలూరు, జులై 25 (న్యూస్‌టైమ్): జిల్లాలో కోవిడ్ కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయిన వెంటనే అందుకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెంటనే గుర్తించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో తన చాంబర్లో అధికారులతో కోవిడ్*19పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్లను గుర్తించి వాటిలో వసతులు సమకూర్చాలని ఆయన సూచించారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండ్రాజవరం, ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలలో అదనపు కోవిడ్ కేర్ సెంటర్లను గుర్తించి ఇందులో వసతులు సమకూర్చాలని ఆదేశించారు.

పాజిటివ్ కేసు నమోదు అయిన వెంటనే వారికి సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి పొజిటివ్ వచ్చి కోవిడ్ లక్షణాలు ఉన్నప్పుడు కోవిడ్ హాస్పిటల్‌కి, లక్షణాలు లేనివారికి దగ్గరలోని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలని ఆయన సూచించారు. ఎవరైనా హోం ఐసోలేషన్ పొందాలనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్ ఇంచార్జ్ అధికారి, మెడికల్ ఆఫీసర్ అతనికి లక్షణాలు లేనట్లయితే అతని హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు అనుమతిని మంజూరు చేయాలని ఆయన సూచించారు.

హోం ఐసోలేషన్‌లో ఉండే వ్యక్తులు ఇంటివద్ద ప్రత్యేకమైన పడక గది కలిగి, కుటుంబ సభ్యులతో కలవకుండా ఉండేవిధంగా ఉండాలని ఆయన సూచించారు. హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారిని ఏ.ఎన్.ఎం.లు ప్రతిరోజు పర్యవేక్షిస్తారని, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన సూచించారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు కఠినమైన ఆంక్షలు విధించదంజరిగిందని ఆ ఆంక్షలను అతిక్రమించి ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైన తిరిగే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు.

ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైన ఎవరు కనిపించినా సరైన కారణం లేనట్లయితే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరమైన పని ఉన్నట్లైతే నే ప్రజలు బయటకు రావాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ సమయంలో కొంతమంది ఐ.డి. కార్డులు చూపించి బయట తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాత సహేతుకమైన కారణం లేకుండా బయట తిరిగి నట్లయితే సంబంధిత శాఖ అధికారులకు నోటీసులు పంపించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు 11 గంటల తర్వాత సరైన కారణం లేకుండా బయట తిరగకూడదని ఆయన ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ పై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎస్.పి, నారాయణ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్స్ శుక్ల, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) నంబూరి తేజ్ భరత్, డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ డీ చంద్రశేఖర్, డి.సిఓ. వెంకటరమణ, ఏలూరు ఆర్.డి.ఓ పనబాక రచన ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

128 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here