న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్‌టైమ్): రైల్వేలు రైల్వే డిజిటల్ సప్లై ఛైయిన్‌ని జిఈఎమ్‌తో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వం ఇ-మార్కెట్ జిఈఎమ్ ద్వారా గూడ్స్, సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్‌లను ధృవీకరించడం, రైల్వే ఏటా రూ.70000 కోట్లకు పైగా వస్తు, సేవలపై దృష్టిసారించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వేల కోసం ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షిస్తుంది. భారతీయ రైల్వేలో మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ సవిస్తర పనితీరును మంత్రి సమీక్షించారు. ‘మిషన్ భారత్‌’కు భారతీయ రైల్వేలు చేదోడుగా నిలవనున్నాయి. భారతీయ రైల్వే ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ఐఆర్ ఈపిఎస్‌ని జిఈఎమ్‌తో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది.

పరిశ్రమలతో ఇంటరాక్ట్ కావాలని, స్వావలంబన కలిగిన భారతదేశం దిశగా పురోగతి సాధించడమే కాకుండా, తయారీతో సహా భారతీయ ఆర్థిక వనరుల భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్‌లో స్థానిక కంటెంట్ క్లాజ్ అవసరం, తద్వారా స్థానిక వెండర్ సప్లయర్‌ల నుంచి మరిన్ని బిడ్‌లు పొందవచ్చు. భారతీయ రైల్వేలు, భారత ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రైల్వే, కామర్స్, ఇండస్ట్రీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమీక్షించారు.

ఈ సమావేశంలో పీయూష్ గోయల్, భారతీయ రైల్వేలపై అవినీతి రహిత, పారదర్శకమైన సేకరణ వాతావరణంలో విశ్వాసం కలిగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షిస్తూ, ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో స్థానిక వెండర్‌ల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని నొక్కి చెప్పారు. ప్రొక్యూర్‌మెంట్‌లో స్థానిక కంటెంట్ క్లాజ్ స్థానిక వెండర్‌లు/సప్లయర్‌ల నుంచి మరిన్ని బిడ్‌లను పొందేవిధంగా ఉండాలని కూడా నిర్ణయించారు. మిషన్ నిర్భర్ భారత్‌కు ఇది ఊతమివ్వనుంది.

ఈ దిశగా భారతీయ రైల్వేల కృషిని సులభతరం చేయడానికి అవసరమైనప్పుడు తగిన విధాన సవరణలు చేయడానికి DPIIT క్రియాశీల మద్దతుకోరింది. స్థానికంగా తయారు చేసిన కంటెంట్‌ను ఎక్కువగా సరఫరా చేసే ఇలాంటి వెండర్లకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించారు. ఒక FAQ సెక్షన్, ఒక హెల్ప్ లైన్ నెంబరును రూపొందించాలని కూడా సూచించారు. తద్వారా ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన వివిధ సమస్యలపై వెండర్‌లు స్పష్టతను పొందవచ్చు.

‘మేక్ ఇన్ ఇండియా’ను పెంపొందించడంపై సభ్యుడు (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), రైల్వే బోర్డు ద్వారా సవిస్తర ప్రజంటేషన్ ఇచ్చారు. జిఈఎమ్ ద్వారా పురోగతిని పొందడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగడి, రైల్వే బోర్డు సభ్యులు, సిఇఓ/జిఇఎం, డిపిఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారతీయ సర్వీస్ ప్రొవైడర్‌లు, కాంపోనెంట్ తయారీదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఈఎమ్) అనేది ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌లో అత్యంత సృజనాత్మక ఆలోచన, మారుమూల ప్రాంతాలు ప్రత్యేకంగా MSMEల వద్ద కూడా మార్కెట్‌ను తెరవడం కోసం జిఈఎమ్ ఫ్లాట్ ఫారంపై సుమారు డెబ్బై వేల కోట్ల రైల్వే గూడ్స్, సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్‌లు చేయాల్సిన అవసరాన్ని గోయల్ నొక్కి చెప్పారు. భారతీయ రైల్వే, భారత ప్రభుత్వం అతిపెద్ద ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీల్లో ఒకటి, జిఈఎమ్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం కోసం జిఈఎమ్‌తో తన ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌లను ఇంటిగ్రేట్ చేస్తోంది.

భారతీయ రైల్వే ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌ని జిఈఎమ్‌తో ఇంటిగ్రేషన్ చేయడం కోసం డిపార్ట్‌మెంట్ టైమ్ లైన్‌లను పంచుకుంది. ఏదైనా మాన్యువల్ ఇంటర్ ఫేస్ అవసరాన్ని తొలగించడం కోసం రెండు వ్యవస్థల అంతరాయం లేని ఇంటిగ్రేషన్ అవసరం అని రైల్వే నొక్కి చెప్పారు. రెండు వ్యవస్థల బలం అంటే రైల్వేలు IREPS, GeMలు జిఈఎమ్ పూర్తి సామర్థ్యాన్ని రైల్వేల సేకరణను ముందుకు తీసుకెళ్లడం కోసం సమ్మిళితశక్తిని ఉత్పత్తి చేయాలి. పోస్ట్ ఇంటిగ్రేషన్ జిఈఎమ్ అనేది భారత ప్రభుత్వ అన్ని ఏజెన్సీలకు సింగిల్ పాయింట్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌గా మారే దిశలో మరింత ముందుకు సాగడానికి ఉద్దేశించారు. సమావేశంలో భారతదేశంలో అవినీతి రహిత పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ వాతావరణాన్ని సృష్టించడం కోసం రైల్వేమంత్రిత్వశాఖ, DPIIT, GeMలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాలని చర్చించారు.

భారతీయ రైల్వేల అభివృద్ధి ప్రయాణంలో పాల్గొనేందుకు మరింత స్వదేశీ విక్రేతలు అభివృద్ధి చెందడానికి పరిశ్రమ నిమగ్నం కావాల్సిన అవసరాన్ని చర్చల్లో నొక్కి చెప్పారు. ప్రజంటేషన్ సమయంలో, రైల్వేస్ తన అన్ని కార్యకలాపాల కోసం యూజర్ ఫ్రెండ్లీ సింగిల్ స్టెప్ వెండర్ వెబ్ ఆధారిత ఇంటర్ ఫేస్‌ని కలిగి ఉండేదిశగా మరింత పనిచేయాలని నిర్ణయించారు. వెబ్ సైట్, పారదర్శకంగా, భారతీయ రైల్వేతో వ్యాపారం ఎలా చేయాలనే దానిపై ఆసక్తి ఉన్న ప్రతి విక్రేతకు ఒక స్పష్టమైన అవగాహనను అందించాలి. భారతీయ రైల్వేలపై అవినీతి రహిత, పారదర్శక వాతావరణం విశ్వాసాన్ని కలిగించడం కొరకు వెబ్ సైట్‌లో అన్ని సంబంధిత సమాచారం ఉండాలి.