చేపలు తింటే కంటి చూపు సురక్షితం?

348

న్యూఢిల్లీ, మే 24 (న్యూస్‌టైమ్): చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఇదే అంశంపై బార్సిలోనాలోని లిపిడ్‌ క్లినిక్‌ పరిశోధకులు ఓ పరిశోధన జరిపారు.

వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు ఈ ముప్పు 48 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. స్పెయిన్‌లో 2003-2009 వరకూ 55-80 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 3,614 మంది టైప్‌2డయాబెటిస్‌ రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.

సాధారణంగా మన కంటిలోని రెటీనాలో ఒమెగా-3 పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది.