సెక్స్ అంటే అదేనా?

0
10 వీక్షకులు

సెక్స్ అంటే అంగాంగ సంభోగం ఒక్కటే కాదు.. భాగస్వామని అర్థం చేసుకోవటం, ఇష్టాయిష్టాలను గౌరవించటం వంటి ఎన్నో అంశాలతో ముడిపడిన వ్యవహారమన్న విస్తృతమైన అవగాహన ఉండాలి. అప్పుడే సెకను మరింతగా ఆస్వాదించే అవకాశముంది. సెక్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. శృంగారం అనేది శారీరక పనిగానే చాలా మంది భావిస్తుంటారు. కానీ అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు పెళ్లయిన కొత్తలో, ఆ తర్వాత ఈ విశయానికి సంబంధించి అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. అసలు ఈ శృంగారం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందామా..శృంగారమన్నది ఏమాత్రం చీకటి వ్యవహారం కాదు.

అలగా, ఆదరాబాదరగా కానిచ్చే పని అంతకంటే కాదు. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముంటుంది. సెక్స్ అంటే అంగాంగ సంభోగం ఒక్కటే కాదు.. భాగస్వామని అర్థం చేసుకోవటం, ఇష్టాయిష్టాలను గౌరవించటం వంటి ఎన్నో అంశాలతో ముడిపడిన వ్యవహారమన్న విస్తృతమైన అవగాహన ఉండాలి. అప్పుడే సెక్స్‌ను మరింతగా ఆస్వాదించే అవకాశముంది. నితానికి పెళ్కైన కొత్తలో దంపతులకు అంతా కొత్తగా ఉంటుంది. అంతకు ముందు పుస్తకాల్లో చదివిన విరుయాలకూ, తమకు అనుభవంలో ఎదురవుతున్న పరిణామాలకూ పొంతనీ ఉండకపోవచ్చు.

అప్పటికే నీలి చిత్రాల వంటివి చూసిన కొందరు.. తమ జీవితం అలా లేదేంటని నిరాశలోకి తారి, జావగారిపోతుంటారు. బయటికి చెప్పుకోలేక లోలోపలే మధనపడుతుంటారు. అంగ ప్రవేశానికి భాగస్వామి సహాయం అవసరమన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి నూతన దంపతులకు ముందు నుంచే లైంగిక ఆరోగ్యంపై చక్కటి అవగాహన ఉండటం అవసరం. శృంగార మన్నది ఒక బాధ్యతాయుతమైన చర్య అన్న విషయం వారికి తెలిసి ఉండాలి. వెంటనే సంతానం కనాలా వద్దా? వద్దనుకుంటే ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడాలి? ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తిచ్చు? అవాంఛిత గరాలంటే ఏమిటి? ఇవన్నీ ముందే తెలియాలి. అలాగే అపోహల్లో కూరుకోకూడదు.

ఫలానా నెలలో ఫలానా పూర్ణిమ రోజు కలిస్తే ఏదో అయిపోతుందని చెప్పటం వంటి లక్షలాది అపోహలు మన సమాజంలో రాజ్యమేలుతున్నాయి. వీటివల్ల శాస్త్రీయ దృక్పథం కొరవడుతుంది. శృంగారమన్నది బాధ్యతతో కూడిన, ఆనందదాయకమైన చర్య అన్న అవగాహన పెరగాలి. అర్థవంతమైన సంబంధాల్లోనే అన్యోన్యత, ఆప్యాయతలుంటాయన్న విరయం తెలుసుకోవాలి. శృంగారాన్ని తేలికగా తీసుకునేవాళ్లు కూడా బంధాలను దాటి.. బయటి మార్గాలను తొక్కుకున్నప్పుడు సురక్షిత విధానాలను, బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించటం చాలా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here