ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దెప్పుడు?

50లక్షల కరోనా బీమా కల్పించాలని అడినా కరుణించరా?

200 చ.గ. ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండు

వ్యక్తిగత ప్రమాద బీమా, హెల్త్ కార్డులు మంజూరుచేయాలని తీర్మానం…

రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు.. నూతన అక్రిడిటేషన్లు అన్నీ గాల్లోనేనా

అన్ని వర్గాలకూ అన్నీ కల్పిస్తూ జర్నలిస్టులకే అన్యాయం ఎందుకు?

పాత్రికేయులులేని సమాజాన్ని ఊహించగలమా? అంటూ హితబోధ

(* పి.సత్యనారాయణ)

ధికారంలో ఎవరున్నా జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదు. వారి బతుకులు అగమ్మగోచరంగా మారాయి. ప్రజా స్వామ్యవ్యవస్థలో నాలుగో మూల స్థంభానికి పునాదిరాళ్ళుగా ఉన్న జర్నలిస్టులు అర్ధాకలితో బతుకుతున్నారు. వారి సంక్షేమానికి ఇటు యాజమాన్యాలూ, అటు ప్రభుత్వం చేసిందేమీ కనిపించడం లేదు. ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులపట్ల అందరిదీ ఒకటే తీరు.

నిజానికి ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు లేకుండా ప్రభుత్వాలు పాలనసాగించడం ఎంత మాత్రమూ సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. ఇది రుజువు కావాలంటే పదిరోజులు జర్నలిస్టులు తమకలాలకు పనిచెప్పడం మానేస్తే తేలిపోతుంది. వారు వార్తలందించక పోతే సమాజంలో ఒక అంధకారం, శూన్యత ఏర్పడుతుంది. అది ఊహించుకోవడమే కష్టం. ఇంతగా సామాజికాభివృద్ధితో పెనవేసుకుపోయిన జర్నలిస్టులకు కష్టమొస్తే పట్టించుకునే నాధుడులేడు. జర్నలిస్టుల్లో ఎవరో కొందరికి మినహా సొంత స్థలాలు, ఇళ్ళు లేవు. సామాజిక భద్రత కల్పించే పథకాలు వారి దరిచేరవు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా నిరోధానికి నిరంతరం శ్రమిస్తుంటే కనీసం అభినందించే నాయకులు రాష్ట్రంలో కరువయ్యారు. కరోనా నిరోధానికి కష్టపడుతున్న వారితో పాటు 50 లక్షల బీమా జర్నలిస్టులకు వర్తింపకపోవటం దారుణం. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు రాష్టంలో కరోనాతో మరణించారు. వారి కుటుంబాలకు ఇంత వరకు ఎలాంటి ఆర్ధిక సహాయమూ అందలేదు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒకమార్గం ఏర్పడుతుందని ఎంతో ఆశగా వారు ఎదురుచూశారు. వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. గత ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి పలుజిల్లాల్లోని జర్నలిస్టులు వారి సమస్యలను తెచ్చారు. వాటి పరిష్కారానికి ఆనాడే గట్టిగా హామీ కూడా ఆయన ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామనే హామీనిచేర్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తరుపున పలుమార్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) జర్నలిస్టుల సమస్యలపై ఎంతో గొప్పగా స్పందించి వారికి ఉగాది నాటికి బిపిఎల్ వారితోపాటు అంతకంటే రెట్టింపు ఇళ్లస్థలాలిస్తామని మాట్లాడారు.

కనీసం 200 చదరపు గజాల వరకూ ఇళ్లస్థలాలు ఉచితంగా పంపిణీ చేస్తారని జర్నలిస్టులంతా ఎదురుచూశారు. ఉగాది వెళ్లిపోయింది. పేదల ఇళ్ళస్థలాల పట్టాల పంపిణీ జూలై 8 నాటికి ,ఆ తర్వాత ఆగష్టు15కి వాయిదా పడింది. బిపిఎల్ వారితోపాటు జర్నలిస్టులకు ఇస్తామనే హామీని గాలికొదిలేసి అందరూ మౌనవత్రం పాటిస్తున్నారు. గత సంవత్సరం మే 30న జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేటప్పుడు జర్నలిస్టుల ప్రమాద బీమా పథకం పొడిగింపు ఫైలుపై తన రెండో సంతకం పెట్టారు. దీనితో వారంతా సంబరాలు చేసుకున్నారు. ఈ పథకానికి సంవత్సరందాటినా అతీగతీ లేదు. 2019 మార్చి 31తో ఈ పథకం గడువు ముగిసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రమాదవసాత్తు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది జర్నలిస్టులు చనిపోయారు.

ఇటీవల అగతముడి చంద్రశేఖర్ అనే వ్యక్తి విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాద బీమా పథకం అమలులో ఉంటే వారి కుంటుంబానికి పది లక్షల పరిహారం వచ్చేది. అదిలేక కుంటుంబ యజమానిని కోల్పోయి వారికుంటుంబాలు ఆర్ధాకలితో బ్రతుకుతున్నారు. నిజానికి ఈ పథకం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదికాదు. జర్నలిస్టులు వారివాటా కింద 198 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే మరికొంత మొత్తాన్ని ప్రభుత్వం జోడించి ఇస్సూరెస్సు కడుతుంది. అదే విధంగా వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కింద జారీచేసే ఆరోగ్యకార్డులు గడువుకూడా ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. నాలుగునెలలకు కావస్తున్నా దీనికొనసాగింపుకు ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వల్ల ఈ హెల్త్ కార్డులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లుబాటులో వుంచింది కాబట్టి సరిపోయిది. లేదంటే జర్నలిస్టులకు ఈపాటి వైద్యం సదుపాయం కూడా అందేదికాదు.

హెల్త్ కార్డుల గడువుతేదీ దాటిపోయినా వాటిని పొడిగిస్తున్నట్లు కనీసం మెమో కూడా సమాచార శాఖ కమిషనర్ నుండి రాకపోవటం జర్నలిస్టుల పట్ల నిర్లష్యానికి నిదర్శనంగా ఉంది. జర్నలిస్టుల బీమా, వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీములకు ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదం రావాలంటూ విచిత్రమైనవాదన ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు. అన్ని పధకాలకూ వేల కోట్ల రూపాయలకు ఆమోదం అభిస్తున్న ఈ తరుణంలో కూడా జర్నలిస్టుల విషయంలో ఈ అలసత్వం దేనికి? పలు రాష్ట్రాలో మాదిరిగానే మన రాష్ట్రంలో విశ్రాంత జర్నలిస్టులకు పించన్లు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ లేదు.

జర్నలిస్టులు పొందే కొద్దిపాటి సంక్షేమానికి ఆధారంగా వున్న ప్రెస్ అక్రిడిటేషన్లను పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప కొత్తవాటిని జారీచేయలేదు. దీనివల్ల కొత్తగా అర్హులైన జర్నలిస్టులూ, మీడియా సంస్థలూ అక్రిడిటేషన్లను కొల్పోతున్నారు. అన్ని వర్గాలకు అన్నీ కల్పిస్తున్న ప్రభుత్వం బతుకు భారంగా మారిన జర్నలిస్టులకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తోంది. పలు మీడియా సంస్థల యాజమాన్యాల మీద, వ్యక్తుల పట్ల వున్న కోపాన్ని జర్నలిస్టులందరి మీదా చూపించడమేమిటని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ ‘మనభూమి’ తెలుగు దినపత్రిక, అధ్యక్షుడు, లోకల్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్, విశాఖపట్నం; 96425 75844)

166 COMMENTS

 1. гидра официальный сайт относительно крупный, в основном, это одна из особо распространенных платформ в государствах СНГ. Потому, если вам нужны определенные не разрешенные категории изделий, тогда вы гарантированно разыщете их здесь.И немалое количество остальных изделий, какие относятся к этим общим группам. Сверх того, Гидра и сайт площадки регулярно раскручиваются, online магазинов становится все больше и больше, ассортиментный набор изделий подрастает, потому, если тут чего-то не существовало прежде, может появится сейчас.

 2. Thank you for each of your hard work on this web page. My aunt really likes going through investigations and it’s really obvious why. Most of us learn all of the lively method you offer practical strategies through this web site and even increase participation from some other people on the issue so our favorite girl is in fact learning a lot of things. Take advantage of the rest of the year. You are always doing a really good job.

 3. I’m commenting to let you be aware of of the beneficial discovery my child developed browsing the blog. She came to find a lot of details, including how it is like to have a great coaching character to get certain people completely comprehend a number of complex issues. You actually did more than her desires. I appreciate you for coming up with such effective, dependable, edifying and cool guidance on that topic to Ethel.

 4. Thanks for your own work on this website. My mum take interest in setting aside time for research and it is simple to grasp why. We notice all relating to the powerful manner you create functional ideas by means of the blog and as well cause contribution from other ones about this article and my child is being taught a great deal. Enjoy the remaining portion of the new year. You’re the one carrying out a first class job.

 5. Needed to send you the very little note just to give thanks again for all the breathtaking guidelines you’ve discussed at this time. It’s extremely generous of people like you in giving extensively all that a few people could have distributed as an e-book in order to make some bucks for their own end, chiefly considering that you could have done it if you considered necessary. The creative ideas additionally acted as the easy way to be certain that most people have a similar dream just like mine to find out a little more in regard to this condition. I’m certain there are lots of more enjoyable moments ahead for folks who discover your blog.

 6. Thank you for each of your hard work on this web page. My aunt really likes going through investigations and it’s really obvious why. Most of us learn all of the lively method you offer practical strategies through this web site and even increase participation from some other people on the issue so our favorite girl is in fact learning a lot of things. Take advantage of the rest of the year. You are always doing a really good job.

 7. Thanks for your whole work on this website. My niece takes pleasure in working on research and it is simple to grasp why. We all notice all relating to the powerful ways you render worthwhile tricks via your website and therefore welcome response from website visitors on this topic while our own simple princess is without question understanding so much. Take pleasure in the rest of the year. Your performing a wonderful job.

 8. I precisely had to appreciate you all over again. I’m not certain the things I might have done in the absence of the actual ideas documented by you directly on such field. It became a real distressing condition for me personally, but encountering a new professional form you managed it forced me to jump for delight. I’m just happier for the guidance and even have high hopes you find out what a powerful job you’re doing instructing most people through your blog. I am sure you’ve never encountered all of us.

 9. I happen to be writing to make you understand what a wonderful experience our princess went through visiting yuor web blog. She realized too many things, with the inclusion of what it is like to possess an incredible teaching style to make the rest without problems understand various very confusing topics. You undoubtedly surpassed visitors’ expected results. Thanks for supplying those warm and helpful, trustworthy, revealing not to mention unique tips on your topic to Tanya.

 10. I enjoy you because of all of your effort on this blog. Debby enjoys conducting internet research and it’s really obvious why. Most of us learn all of the lively method you offer practical strategies through this web site and even increase participation from some other people on the issue so our favorite girl is in fact learning a lot of things. Take advantage of the rest of the year. You are always doing a really good job.

 11. I am glad for writing to make you know what a incredible encounter my friend’s girl gained studying your web page. She learned plenty of pieces, which include what it’s like to possess an awesome helping mood to let other folks smoothly know just exactly several multifaceted subject matter. You truly exceeded our own expectations. Thank you for offering these necessary, safe, explanatory and even fun tips about this topic to Julie.

 12. I’m just commenting to let you be aware of of the extraordinary discovery my cousin’s daughter enjoyed going through your blog. She discovered lots of issues, most notably how it is like to have a very effective giving heart to have many others effortlessly gain knowledge of certain extremely tough matters. You really did more than my desires. Many thanks for displaying the helpful, healthy, educational and also easy thoughts on the topic to Gloria.

 13. Thanks for the tips about credit repair on this blog. Things i would advice people would be to give up the mentality that they’ll buy right now and pay later. As a society all of us tend to do this for many things. This includes holidays, furniture, as well as items we want. However, you have to separate your own wants from all the needs. When you are working to improve your credit rating score you have to make some sacrifices. For example you are able to shop online to save money or you can turn to second hand shops instead of costly department stores with regard to clothing.

 14. I am also commenting to let you know of the helpful encounter my friend’s daughter found reading through your web page. She figured out numerous issues, not to mention what it’s like to have an amazing giving mood to have most people really easily know selected impossible subject areas. You really exceeded our own expectations. Many thanks for imparting the invaluable, safe, explanatory and even easy thoughts on the topic to Janet.

 15. рабочее зеркало гидры, конечно же, обеспечивает анонимность в глобальной интернет-сети, и все же, данной защищенности не хватает и работать с проектом с обыкновенного интернет-браузера невозможно. При открытии ресурса используя привычный для вас интернет-браузер провайдер отследит все проекты, на какие вы заходили, и настолько сомнительная активность заинтересует органы правопорядка. Потому следует поразмышлять о дополнительной безопасности.

 16. where to buy generic viagra in canada cheapest pharmacy gold coast viagra generic viagra viagra 100mg side effects viagra sale online viagra in australia buy viagra australia bootleg viagra viagra for sale cheapest buy viagra overnight shipping canada generic viagra in canada the real viagra for sale buy viagra in los angeles viagra tablets in india viagraeb_amphl=freb_amprlz=1t4adfa_frca391ca391eb_ampprmd=ivnseb_ampei=ccmrtd7gepdtgqfrxyz0bqeb_ampstart=10eb_ampsa=n

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here