ఏపీలో కొత్త అక్రిడిటేషన్ల జారీకి ముహూర్తం

0
21 వీక్షకులు
http://www.ipr.ap.gov.in వెబ్‌సైట్ హోం పేజీ

అమరావతి, మే 22 (న్యూస్‌టైమ్): మీడియా ప్రతినిధులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల (అక్రిడిటేషన్ల) జారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ ముహూర్తాన్ని ఖరారుచేసింది.

దీనికి సంబంధించి గతంలో ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాల రీత్యా అప్పట్లో కొత్త అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయి ‘ఎక్స్‌టెన్షన్’ కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అప్పట్లో ఇచ్చిన ఆరు నెలల గడువు వచ్చే నెలాఖరు (జూన్ 30)తో ముగుస్తుండడంతో కొత్త కార్డులను జారీచేయాలని తాజాగా నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో గతంలో ఆన్‌లైన్ చేసిన వారు అప్పట్లో దరఖాస్తుతో పాటు సబ్‌మిట్ చేయని ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి, ఇంకేవైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసుకునే వెసులుబాటును I&PR కల్పించింది.

సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కొత్త కార్డుల జారీ ఈసారైనా కార్యరూపం దాల్చుతుందని ఆశిద్దాం.

పాత లాగిన్ వివరాలు గుర్తులేని వారు పాస్‌వర్డ్ రీసెట్ కోసం ప్రయత్నించవచ్చు. కొత్తవాళ్లు కూడా మళ్లీ రిజిస్ట్రేషన్ కావచ్చు.

URL… http://ipr.ap.gov.in/login

మరిన్ని వివరాలకు I&PR కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పరిశీలించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here