ఐటీ చిక్కుల్లో హస్తం పార్టీ

100
దేశరాజధాని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): హస్తం పార్టీ ఐటీ చిక్కులొచ్చి పడ్డాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీ వద్ద దాదాపు 179 కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 179 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోవడంతో ఈ నోటీసులు అందుకోకతప్పలేదు కాంగ్రెస్ పార్టీకి. హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆ డబ్బు అందినట్లు గుర్తించిన ఐటీ అధికారులు శాఖాపరమైన దర్యాప్తును చేపట్టారు.

నవంబర్ నాలుగున కాంగ్రెస్ సీనియర్ ఆఫీస్ బేరర్స్‌కి నోటీసులు జారీచేసినా ఐటీ విభాగం తమ ముందు హాజరుకాని పదాధికారులపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ముట్టిన విరాళాలకు సంబంధించిన వ్యవహారంలో బోగస్ బిల్లులు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులకు సంబంధించి బోగస్ బిల్లులను సమర్పించినట్టు ఐటీ శాఖ దర్యాప్తులో తెలినట్లు సమాచారం.