నిన్న కాక మొన్న ట్విట్టర్‍ ద్వారా బిజెపి నేతలపై విమర్శలు, ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి బెయిలు రద్దు కాబోతుందని, త్వరలో ఆయన మళ్లీ జైలుకు వెళ్లటం ఖాయమనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాఖ్యలు చేసి సంచలనానికి తెరలేపారు. అదే విధంగా రాష్ట్ర బిజెపి ఇంఛార్జి సునీల్‍ డియోదర్‍ మరో అడుగు ముందుకేసి సీఎం జగన్‍ రెడ్డిపై అవే వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం జగన్‍ రెడ్డి బెయిలు రద్దు అవుతుందని, ఆయన త్వరలో జైలుకు వెళ్లటం ఖాయం అన్నారు.

అటు సోము వీర్రాజు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై, ఇటు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డిపై బిజెపి నేత సునీల్‍ డియోధర్‍ చేసిన వ్యాఖ్యలు వెనుక ఏదో రహస్య సమాచారం వారికి అంది ఉంటుందని, పలు రాజకీయ పార్టీల నేతలు మీడియాతో తెర వెనుక చెబుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నిక కాంగ్రెస్‍ అభ్యర్ధి చింతా మోహన్‍ సీఎం జగన్‍ రెడ్డిపై మరో విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో ఆరు నెలలే కానసాగుతారన్నారు. కానీ, జగన్‍ రెడ్డి బెయిలు రద్దు అవుతుంది కానీ, ఆయన మళ్లీ జైలుకు వెళతారని, కానీ చింతా మోహన్‍ వ్యాఖ్యానించలేదు.

బిజెపి నేతలు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‍ ఆ విధంగా సునీల్‍ డియోధర్‍ ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికార ప్రజాప్రతినిదులు, అమాత్యులలో ఆ వ్యాఖ్యలు అలజడి రేపింది. ఆ ముగ్గురు చేసిన వ్యాఖ్యలు నిజమేనా? అంటూ తమకు తెలిసిన మీడియా వర్గాలతో తెర వెనుక కొందరు వాస్తవాలు ఏమిటో చెప్పిండని కోరుతున్నారట. ఆ ముగ్గురు నేతలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయం మాకు తెలీదు.

ఆ ముగ్గురు నేతలను అంత తేలికగా కొట్టిపారేయలేము. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందన్న విషయం అతి కొద్దిమందికి తెలుసు. వారి ద్వారా ఈ ముగ్గురికి సమాచారం అంది ఉండే అవకాశాలున్నాయని మీడియా ప్రతినిధులు వారికి చెప్పినట్లుగా బయటకు పొక్కింది. మా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగటం ఖాయమని పదే పదే అమాత్యులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలలో ఎంత వరకు నిజం ఉందన్న విషయం పక్కన పెడితే అంతా సీఎం జగన్‍ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

సునీల్‍ డియోధర్‍తో పాటు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల కన్నా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‍ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అనేక సంవత్సరాలు ఎంపీగా చింతా మోహన్‍ ఉన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సంబందాలున్నాయి. ముఖ్యంగా దళిత సామాజికవర్గానికి చెందిన ఐఎఎస్‍, ఐపిఎస్‍ అధికారులు చింతా మోహన్‍కు తెలుసు. ఒకవేళ వారి నుండి సమాచారం చింతామోహన్‍‌కు తెలిసిందేమో? అందుకే సిఎం జగన్‍ రెడ్డి మరో ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉంటారని వ్యాఖ్యనించారేమో.

చింతా వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేయద్దని ఆయనకు అపార రాజకీయ, అధికార అనుభవం ఉందని, ఢిల్లీ అధికారులతో చింతాకు సన్నిహిత సంబంధాలు ఎప్పటినుండో ఉన్నాయని, త్వరలో ఏం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.