జర్నలిస్టులకు జగనన్న అండ

0
8 వీక్షకులు
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేస్తున్న పాత్రికేయులు

విజయవాడ, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో పోలీస్, పంచాయితీ, వైద్య శాఖలకు ధీటుగా విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుతూ మైలవరం పాత్రికేయులు బుధవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ పాత్రికేయులు మాత్రం ప్రాణాలను తెగించి కరోనాలో విధులు నిర్వహిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతాన్నారని ఆయన ప్రశంసించారు.

ఈ పరిస్థితిలో జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు 50 లక్షల బీమా సదుపాయం, మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, పేద జర్నలిస్టులకు ఆర్ధిక సాయం వంటి విషయాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు యు. వెంకట్రావు, మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జబ్బర్, గౌరవాధ్యక్షుడు మన్నే సాంబశివరావు, జర్నలిస్టులు మురళి, కృష్ణప్రసాద్, బి. వెంకట్రావు, పగడాల శ్రీనివాస్, చిట్టిబాబు, మాధవ్, చండీప్రసాద్, బాలు, నాగరాజు, మట్ట రవి, హరికృష్ణ, విజయ్, యం. శ్రీనివాస్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here