సీఎం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

0
6 వీక్షకులు
వెలంపల్లి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిమ్మరాజు చలపతిరావు, చావా రవి, రాజేశ్వరరావు కొండా, దారం వెంకటేశ్వరరావు
  • ఏపీయూడబ్ల్యూజేకు మంత్రి వెలంపల్లి హామీ

విజయవాడ, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని వర్తింపచేయాలని ఏపీయూడబ్ల్యూజే నేతలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును కోరారు. సోమవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, రాజేశ్వరరావు కొండా, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దారం వెంకటేశ్వరరావు రాష్ట కమిటీ పిలుపు మేరకు మంత్రికి వినతిప్రతం సమర్పించారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులందరికీ పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకం గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసినందున 2020-21 సంవత్సరానికి కూడా అంతరాయం లేకుండా కొనసాగేలా ఆదేశాలివ్వాలని వినతి పత్రంలో కోరారు.

అలాగే జర్నలిస్టుల వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక పాత్రికేయులకు సరైన వేతన వ్యవస్థ లేదని వారి ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాజంలో వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహకారాన్ని పాత్రికేయులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దాంతో స్పందించిన మంత్రి వెలంపల్లి జర్నలిస్టుల సమస్యలను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టి తీసుకు వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్‌లు కరోన నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సమచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కూడా ఓసారి మాట్లాడతానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here