కాకతీయ క్రషర్స్ కరోనా సాయం

0
9 వీక్షకులు

వరంగల్, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): క‌రోనా క‌ష్టాల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి అహ‌ర్నిష‌లు ప‌ని చేస్తున్న సీఎంకి, మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు అనేక మంది విరాళాలు అంద‌చేస్తున్నారు. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ జిల్లా కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో రూ.5 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఆ చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి ఆయ‌న సొంతూరు ప‌ర్వ‌త‌గిరిలో అంద‌చేశారు.

ఆ నిధిని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా నిర్మూల‌న‌కు వినియోగించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, క‌రోనా కట్ట‌డికి మేమున్నామ‌ని ఎంద‌రో ముందుకు వ‌స్తున్నార‌ని వాళ్లందిరినీ అభినందిస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మై, మ‌రోవైపు ఆర్థిక మాంద్యం నెల‌కొన్న త‌రుణంలో వ‌చ్చిన క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ని ఆందోళ‌న‌ల ప‌డేసింద‌న్నారు. అయితే, మిగ‌తా ప్ర‌పంచానికి, దేశాల‌కు, రాష్ట్రాల‌కు భిన్నంగా అంద‌రికంటే ముందుగా లాక్‌డౌన్ విధించి సీఎం కేసీఆర్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి అన్నారు.

ఆ నిర్ణ‌య‌మే ఇవ్వాళ మ‌న రాష్ట్రాన్ని సుర‌క్షితంగా ఉంచింద‌ని మంత్రి తెలిపారు. అయితే, నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డం, క‌రోనా నిర్మూల‌న కోసం మేమున్నామ‌ని అనేక మందితోపాటు కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ముంద‌కు రావ‌డానికి మంత్రి ఎర్ర‌బెల్లి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాక‌తీయ స్టోన్ క్ర‌ష‌ర్స్ సంక్షేమ సంఘం వ‌రంగ‌ల్ రూర‌ల్ అధ్య‌క్షుడు పి.మ‌ధుసూద‌న్ రావు, కార్య‌ద‌ర్శి న‌రేశ్, స‌భ్యులు ప్ర‌దీప్ రావు, సుజిత్ రావు, శ్రీ‌నివాస యాద‌వ్, సిహెచ్. రామ్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎన్.రామ్ రెడ్డి, మ‌ధు, రామ్ నారాయ‌ణ‌, కె.ప్ర‌భాక‌ర్ రెడ్డి, ర‌ఘుప‌తిరెడ్డి, ప్ర‌వీణ్, ర‌వింద‌ర్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here