ఆపన్న కుటుంబానికి కేటీఆర్ సాయం

0
10 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): ఎర్రగడ్డలో నివసించే ఒక కుటుంబం దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 5 నెలల పాప ఉంది. అనుకోకుండా అనారోగ్య కారణాల వల్ల నెల రోజుల క్రితం పాప తల్లి చనిపోవడం జరిగింది. తండ్రి ఆ పాపను చూసుకుంటున్నాడు. రోజు పని చేసుకుంటే తప్ప ఆ కుటుంబానికి జీవనం సాగదు. లాక్‌డౌన్ వల్ల నెల రోజుల నుండి పనిలేకపోవడం వల్ల పాపకు పాలు నిత్యవసర వస్తువులను అందించడం కష్టంగా మారింది ఆ కుటుంబానికి.

ఈ విషయాన్ని వారి పక్కనే ఉండే ఒక వ్యక్తి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించిన కేటీఆర్ పక్కనే ఉండే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను తక్షణమే వెళ్లి ఆదుకోవాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన అర్ధగంటలోనే (అర్ద రాత్రి 1గంటకు) ఆ కుటుంబం వద్దకు చేరుకొని ఆ పాప కావాల్సిన పాలు ఇతర అన్ని వస్తువులతో పాటు ఆ కుటుంబానికి కావలసిన నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. ట్విట్టర్లో చెప్పాగానే వెంటనే స్పందించిన కేటీఆర్‌కు, వచ్చి నిత్యావసర వస్తువులు అందించిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌కు ఆ కుటుంబం; అదే విధంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

చెప్పగానే తక్షణమే వెళ్లి చిన్నారికి పాలు ఆ కుటుంబానికి ఇతర నిత్యవసర వస్తువులను అందించిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ‘వెల్ డన్ బాబా’ అని అభినందించారు. దినికి మీరే మాకు స్ఫూర్తి అన్న అని బాబా బదులిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here