గ్రామదేవతకు శఠగోపం!

28
92 వీక్షకులు
గ్రామదేవత ఆలయం
  • నిన్న లంగరుఖానా… నేడు వనమూలమ్మ

  • గ్రామ దేవత భూములపై పె(గ)ద్దల కన్ను

  • పార్టీలు వేరైనా అక్కడ అందరూ ఒక్కటే

  • భీమిలిలోనే దేవాదాయానికి చిల్లు

  • పట్టించుకోని మంత్రి ముత్తంశెట్టి తీరుపై విమర్శలు

విశాఖపట్నం, మే 16: ఏ దేవతలనైతే పూజిస్తారో ఆ దేవతల భూములను కైంకర్యం చేసుకునేందుకు వెనుకాడరు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఆయా ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు రాజకీయ నాయకులు తమకున్న పలుకుబడితో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

అందుకు ఇక్కడ రాజకీయ పార్టీలు అడ్డు కాబోవు. ఆస్తుల ఆక్రమనే ప్రధాన అజెండాగా ప్రయత్నాలు సాగుతుంటాయి. భీమిలిలోని లంగర్ ఖానా ఆస్తుల వేలానికి సంబంధించి కంచే చేను మేసినట్లు ఒక మంత్రి తన బంధువులకు కట్టబెట్టే ప్రయత్నం చేయగా అనందపురం మండలం మామిడిలోవ గ్రామంలోని గ్రామ దేవత ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు గత ప్రభుత్వంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే చేయని ప్రయత్నమంటూ లేదు. వాస్తవంగా గ్రామదేవతల పేరిట ఉన్న ఆస్తులు దేవాదాయ, ధర్మాదాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. పబ్లికేషన్, నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు పరిగణలోకి రావు.

అయితే, పాలకుల ఆశీస్సులతో వాటిని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తను ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) ఈ వ్యవహారాలను ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. అయితే, ఎవరు అడ్డుపడ్డా ఆ గ్రామ దేవతలు తమ స్థలాలను తామే పరిరక్షించుకుంటారని మామిడిలోవ గ్రామస్తులు సంపూర్ణ విశ్వాసంతో వున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ గ్రామ దేవతల భూముల స్వాహాకు ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇందుకు బీజం పడగా నేటి వైసీపీ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం మండలం మామిడిలోవ గ్రామంలో ఉన్న శ్రీ వనమూలమ్మ గ్రామ దేవతకు చెందిన భూములపై పెద్దల దృష్టి పడింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇందుకు అంకురార్పణ జరగ్గా నేటి వైసీపీ ప్రభుత్వంలో అందుకు మరింత బలంగా పావులు కదిపే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

తెలుగుదేశం హయాంలో పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే వర్మ అప్పట్లో ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు ఇందుకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మామిడిలోవలోని సర్వే నెంబర్లు 44, 46, 51లో ఉన్న భూములను స్వాహా చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సర్వే నంబర్లు 44/1, 51లో ఉన్న విలువైన భూములు గ్రామదేవత పేరిట ఉన్నాయి.

గ్రామదేవత భూమి

ఆయా భూములను గత 50 ఏళ్లుగా యాదవ, మన్య దొరలు సాగు చేస్తున్నారు. సర్వే నెంబర్ 51లోని 3.54 ఎకరాల భూమిని సొంతం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా కొందరు 2016లో అప్పటి జాయింట్ కలెక్టర్ నివాస్‌ను ఆశ్రయించారు. దీనిపై ఆనందపురం తహసిల్దార్, విశాఖపట్నం ఆర్డీవోలు సమగ్రంగా విచారణ జరిపి జాయింట్ కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు. దాని ఆధారంగా నివాస్ ఆ భూములపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ గ్రామదేవత పేరిట పొరపాటున సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్‌లో ఆ భూములు లిఖించి ఉన్నాయని చెబుతూ దరఖాస్తుదారులకు అనుకూలంగా తీర్పు నిచ్చారు.

దాన్ని సవాల్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన కొందరు తాము కూడా హక్కుదారులమంటూ 2018లో అప్పటి జాయింట్ కలెక్టర్ జి. సృజనను ఆశ్రయించారు. దీనిపై మళ్లీ జాయింట్ కలెక్టర్ సమగ్రంగా విచారణ జరిపి నివాస్ ఆర్డర్‌ను ఓకే చేశారు. వాస్తవంగా ఆ భూమిని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు తనయుడు నంబూరి కళ్యాణ్ చక్రవర్తి కొనుగోలు చేశారు. వారంతా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు గత ఏడాది నవంబర్లో ఎమ్మెల్యే శంకర్రావు తనయుడు దరఖాస్తు చేశారు.

ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఒక వినతిపత్రాన్ని ఎమ్మెల్యే సమర్పించారు. గత జాయింట్ కలెక్టర్ సృజన ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ భూమిపై హక్కులు తమకే ఉన్నాయంటూ దరఖాస్తు చేసిన దరిమిలా ప్రస్తుత కలెక్టర్ వినయ్ చంద్ ఆ భూములపై సమగ్ర విచారణకుగాను గత ఏడాది డిసెంబర్‌లో ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సర్వే నెంబర్ 51లోని గ్రామదేవత పేరిట ఉన్న 3.54 ఎకరాలకు సంబంధించి ఎందుకు పబ్లికేషన్ చేయలేదు? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? అనే దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత ఏడాది చివర్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి జిల్లా సహాయ కమిషనర్ వినోద్‌కుమార్ ఆ భూములపై విచారణకు ఒక మేనేజర్‌ను ఆదేశించారు. ఆయన ఇచ్చిన నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి. సర్వే నెంబర్ 51లోని 3.54 ఎకరాల భూమి గ్రామ దేవత పేరిట ఉన్నట్లు సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్‌లో చోటుచేసుకుందని తెలియజేశారు.

మామిడిలోవ గ్రామస్తులను విచారణ చేయగా తమ గ్రామంలో శ్రీ వనమూలమ్మ అమ్మవారి ఆలయం (చెట్టు) లేదని శ్రీ ముత్యాలమ్మ, శ్రీ బంగారమ్మ, శ్రీ కుంచాలమ్మ, శ్రీ మరిడితల్లి (చెట్టు) అమ్మవార్లు ఉన్నట్లు చెప్పినట్లు మేనేజర్ ఆ నివేదికలో వెల్లడించారు. గ్రామ దేవత పేరిట ఉన్న భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ఎటువంటి పబ్లికేషన్, రిజిస్ట్రేషన్ జరపలేదని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒక మెలిక ఉండడం గమనార్హం. జాయింట్ కలెక్టర్ నివాస్ హయాంలో జరిగిన విచారణలో గ్రామదేవత పేరిట ఉన్న భూమికి అప్పటి అధికారులు ఎటువంటి అభిప్రాయంతో నివేదిక ఇచ్చారో అదే అభిప్రాయంతో గుడిలోవ రంగనాథస్వామి ఆలయం మేనేజర్ ఏకీభవించి నివేదిక ఇవ్వడం గమనార్హం.

దేవాదాయ శాఖ అధికారులు మేనేజర్‌తో ఆ విధంగా రాయించి భూములు పొందగోరు వారికి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు లేకపోలేదు. గ్రామదేవత పేరిట భూములు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు ఇంతవరకు ఎందుకు పబ్లికేషన్, రిజిస్ట్రేషన్ చేయలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. దీనిపై దేవాదాయ శాఖ అధికారులను ప్రశ్నించగా అప్పటి జాయింట్ కలెక్టర్ నివాస్ ఆ భూములు ప్రైవేటువని తేల్చడంతో తాము ముందుకు పోలేక పోయామని చెప్పడం విశేషం. ఇదే అంశమై దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేసిన వినోద్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు కూడా ప్రచారంలో వుంది. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి గ్రామదేవత పేరిట ఉన్న ఆ భూములను ఆ అమ్మవార్లకే సొంతం చేయాలని మామిడిలోవ గ్రామస్తులు కోరుతున్నారు.

వనమూలమ్మను గ్రామదేవతగా ప్రచారం చేస్తే రికార్డుల ప్రకారం వనములమ్మ పేరిట భూమి లేనందున దాన్ని స్వాధీనం చేసుకోవడం సులువుగా భావిస్తూ సాక్ష్యాలు సిద్ధం చేసే పనిలో పడ్డారని వినిపిస్తోంది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ భూములపై దృష్టి సారించి గ్రామదేవత పేరిట ఉన్న భూములను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

(నారాయణ్ పోతుమహంతి, సీనియర్ జర్నలిస్ట్; 98491 47350)

28 COMMENTS

  1. [url=https://tretinoin365.com/]tretinoin[/url] [url=https://cipro.us.org/]cipro tablet price[/url] [url=https://flomaxmed.com/]flomax generic best price[/url] [url=https://prednisone.us.org/]order prednisone online no prescription[/url] [url=https://lxapro.com/]lexapro 5mg cost[/url] [url=https://chydroxychloroquine.com/]plaquenil hydroxychloroquine cost[/url] [url=https://ivaltrex.com/]valtrex without presciption[/url] [url=https://vardenafilxr.com/]buy vardenafil[/url]

  2. [url=https://singulair.us.com/]20 mg singulair[/url] [url=https://proscar.us.com/]proscar price uk[/url] [url=https://chloroquinaralen.com/]chloroquine for sale[/url] [url=https://duloxetine.us.com/]cymbalta 60 mg tablets[/url] [url=https://attarax.com/]atarax online[/url] [url=https://priligy.us.com/]buy priligy[/url] [url=https://ivermectin.us.org/]buy ivermectin[/url] [url=https://bupropion365.com/]how to buy buproprion on line[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here