ఎల్జీ పాలిమర్స్‌కు చుక్కెదురు

0
7 వీక్షకులు

న్యూఢిల్లీ, మే 26 (న్యూస్‌టైమ్): ఎల్జీ పాలిమర్స్ సంస్థకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన యాజమాన్య వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్‌జీ పాలిమర్స్‌ విజ్ఞప్తి చేసింది.

ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పిటిషన్‌లో పేర్కొంది. ఎన్జీటీ లేదా హైకోర్టు వీటిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here