మీడియా వాహనంలో తిరుమలకు మద్యం

0
7 వీక్షకులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం, మాంసం

తిరుపతి, మే 13 (న్యూస్‌టైమ్): మీడియా వాహనంలో తిరుమలకు మద్యం, మాంసం తరలిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ‘మహాన్యూస్’ టీవీకి చెందిన వ్యక్తి నాలుగు చక్రాల వాహనంలో అలిపిరి టోల్‌గేట్ మీదుగా తిరుమలకు మద్యం, మాంసం తరలిస్తూ తనిఖీ అధికారులకు పట్టుబడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీకి చెందిన ‘మహాన్యూస్’లో నిందితుడు యాంకర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. 11 లీటర్లు నాటుసారాతో పాటు 5 కిలోల కోడి మాంసం, ఖరీదైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ ఉదంతంపై ‘‘తిరుమల కొండమీద అన్యమతస్తులు తాగి తింటూ అపవిత్రం చేస్తున్నారనే డ్రామా క్రియేట్ చేసి ప్రభుత్వం మీద బురద చల్లాలని పెద్ద స్కెచ్ వేశారు. లాక్‌డౌన్ కారణంగా భక్తులు ఎవ్వరూ రాకపోవటంతో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ తిరుమల పవిత్రతని మంట కలుపుతున్నారని దీనికి ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసి బ్రేకింగ్ న్యూస్ వేయాలని కుట్రపన్నారు’’ అంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. దానికి తోడు తిరుమల కొండమీద నాటుసారా కాస్తున్నారని, అన్యమత ప్రచారం అనీ రకరకాలుగా స్క్రిప్ట్ అల్లుకొని పచ్చ ఛానళ్లలో ఊదరగొట్టాలని వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here