సీఎం కేసీఆర్‌కు ‘మారెడ్డి’ కృతజ్ఞతలు

18616

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): కొత్తగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాసరెడ్డి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకుడు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది.