రూ.3 కోట్లతో రిపేర్లకు వీసీ నిర్ణయం..

లక్ష చదరపు అడుగుల భవన స్లాబ్‌పై వాటర్ లీకేజీలు..

మరో వందేళ్లు సురక్షితంగా ఉండేట్లు ఏర్పాట్లు…

త్వరలో పనులు చేపట్టనున్న హెచ్ఎండీఏ…

త రెండేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా ఉన్న అర్వింద్‌కుమార్ యూనివర్సిటీ పరిస్థితుల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికబద్దంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓయూ క్యాంపస్లో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా లక్షల సంఖ్యలో మొక్కలను నాటి ఓయూను గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దారు.

అనునిత్యం విద్యార్థులు, అధ్యాపకులతో సందడిగా ఉంటే ఓయూ క్యాంపస్లో రాత్రి వేళలు పగలు తలపించేలా యూనివర్సిటీ ప్రధాన రహదారుల (మెయిన్ రోడ్స్) వెంట సుమారు రూ.8లక్షల వ్యయంతో ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయించారు. చారిత్రక కట్టడాల మనుగడపై ఎంతో మక్కువ కలిగిఉన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వేలాది మందిని వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన హెరిటేజ్ స్ట్రక్చర్ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్‌ను పరిరక్షించి మరిన్ని దశాబ్దాల పాటు మనుగడ రూ.3కోట్ల వ్యయంతో రిపేర్స్ చేయించేందుకు నిర్ణయించారు. ఆ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు అప్పగించారు. నిజాం హయాంలో ఆనాటి భవన నిర్మాణ సామాగ్రి(డంగుసున్నం)తో కట్టారు. కొన్ని దశాబ్దాల కాలంగా మేజర్ రిపేర్లకు నోచుకోకపోవడంతో స్లాబ్ పైభాగం దెబ్బతిని వాటర్ లీకేజీలతో పైకప్పు పెచ్చులూడి పోతున్నది. దీంతో ఆర్ట్స్ కాలేజీ గోడలు, ఫర్నిచర్, ఎలక్రిసిటి ఫిట్టింగ్స్ పాడైపోయి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 80 ఏండ్ల క్రితం మూడు అంతస్తులుగా నిర్మించిన ఆర్ట్స్ కాలేజీ హెరిటేజ్ బిల్డింగ్ (స్ట్రక్చర్) వాటర్ లీకేజీల కారణంగా భవన నిర్మాణం క్రమంగా పెచ్చులూడి ప్రమాదాలకు హేతువుగా మారుతున్నది. దాదాపు లక్ష చదరపు అడుగుల మేరకు ఉన్న స్లాబ్‌పై వాటర్ లీకేజీలు నివారించేందుకు ఇప్పటి వరకు తాత్కాలికంగా చేసిన ఏర్పాట్లు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దాంతో ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సిహెచ్.గోపాల్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.రవీందర్ బిల్డింగ్ పరిస్థితులను వివరించడంతో ఇన్ చార్జి వైస్ చాన్సలర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్నారు.

ఐదెకరాల ఆర్ట్స్ కాలేజి ఏడవ నిజాం అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1934 జులై 5వ తేదీన ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ ప్రాజెక్టును ఆనాడే దాదాపు రూ.30లక్షల వ్యయంతో చేపట్టారు. ఆరోజుల్లోనే కంజీవరం, కోయంబత్తూరు, సేలం, తంజావూరు, తుర్కపాలెం, తిరునెల్వేలి ప్రాంతాలకు చెందిన రాతిపనుల నిపుణులు 600 మందికిపై ఆర్ట్స్ కాలేజీ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
గ్రానైట్, పాలిఫ్ట్ గ్రానైట్, సిమెంట్, ఆర్సీసీ , స్టీల్, డంగుసున్నం, ఇసుక వంటి నిర్మాణ సామాగ్రి పింక్ గ్రానైట్ వినియోగించి దాదాపు రెండున్నర (2.5 లక్షల) లక్షల చదరపు అడుగుల మేరకు నిర్మాణ పనులను ఐదున్నర సంవత్సరాలు (65 నెలల పాటు) జరిపి 1939 డిసెంబర్ 4న ఓపెనింగ్ సెర్మని నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నిజాం కాలేజి (బషీర్ బాగ్)లో విద్యార్ధుల సౌకర్యార్ధం మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారి ఆదేశాల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ మూడు అంతస్థులు(జి+3)దాదాపు 37, 384 చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఓయూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు రెగ్యులర్ ప్రమోషన్లు కల్పించారు. గత రెండేళ్లలో కామన్ ఎంట్రెన్స్ పరీక్షల చైర్మన్ గా టిఎస్ ఎడ్ సెట్, టిఎస్ పిజిఈసెట్, టీఎస్ లాసెట్ లను విజయవంతంగా నిర్వహించారు. గత ఏడాది కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం కావడంతో అందుకనుగుణంగా ఓయు క్యాంపస్ లో తరగతుల నిర్వహణకు సన్నాహాలు చేశారు.

వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ భూములను పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో దాదాపు 12 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో వర్సిటీ పరిసరాలు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వర్సిటీ ప్రాంగణంలో పర్యటించిన అక్కడి గ్రీనరీని చూసి హెచ్ఎండిఏ అధికారులను అభినందించారు. ఓయూ పరిధిలో తొమ్మిది (9) చోట్ల యాదాద్రి మోడల్ (మియావాకి పద్దతి)లో దాదాపు మూడు(3)లక్షల మొక్కలు, మిగతా ఖాళీ స్థలాల్లో తొమ్మిది (9)లక్షల మొక్కలు ఎదుగుతున్నాయి. సహజసిద్ధమైన ప్రకృతి వనరులు కలిగిన ఉస్మానియా వర్సిటీకి పూర్వవైభవం తీసుకువచ్చే లక్ష్యంతో కుందేళ్లు, నెమళ్లు ఇతర ఆటవీ పక్షులు అలరారే విధంగా పూలు, పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టామని, మర్రి, ఉసిరి, సీతాఫలం, దానిమ్మ, అల్లనేరేడు, కానుక, వేప వంటి మొక్కలను నాటినట్లు చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్ లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్కలు టెకోమా గాడిచౌడి (ఎల్లో కలర్), రెండు మూడు రకాలకు చెందిన సిజల్ పినియా, నెమలినారా, గుల్‌మోహర్, క్యాథోడియా వంటి పూల మొక్కలు యూనివర్సిటీ పరిధిలో ఎదుగుతున్నాయి.