నిత్యావసరాల ధరలు పెంచితే చర్యలు

0
3 వీక్షకులు

చిత్తూరు, మార్చి 25 (న్యూస్‌టైమ్): కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంటికే పరిమితం కావాలని అత్యవసరం అయితేనే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిందని, ఈ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు సంఘీభావంగా ఇంటికే పరిమితమవుతూ అత్యవసర సమయాలలో మాత్రమే బయటకు రావాలని గుంపులు గుంపులుగా బయట తిరగరాదని తెలిపారు.

లాక్‌డౌన్ కారణంతో వర్తక వ్యాపారులు నిత్యవసర సరుకులు, కూరగాయల కృత్రిమ కొరతను సృష్టించి అధిక దరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిత్యవసర వస్తువులు, వంట నూనెలు, కూరగాయలు సంబంధించి టోకు వ్యాపారులు, రిటైల్ వర్తకులు నిర్ణీత ధరలకు మాత్రమే అమ్మాలని, అలా కాకుండా అధిక ధరలకు అమ్మినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉండేందుకు, ప్రజలు ఒకే చోట గుంపులుగా చేరకుండా ఉండేందుకు నాలుగు, ఐదు చోట్ల కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు టౌన్‌లో ప్రధాన కూరగాయల మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా కట్టమంచి ప్రాంతంలో మామిడికాయల మండిలో, సంతపేట ప్రాంతానికి సంబంధించి కాణిపాకం రోడ్‌లోని పీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణంలో, దర్గా ప్రాంతానికి సంబంధించి కణ్ణన్ కళాశాల ఆవరణంలో, గిరింపేటకు సంబంధించి పివికెఎన్ కళాశాల మైదానంలో, కొంగారెడ్డి పల్లెకి సంబంధించి పూల మార్కెట్‌లో కూరగాయలు విక్రయించుకునేందుకు వీలుగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలకు, అంగన్‌వాడీ సెంటర్లకు సెలవులు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు వారి సిబ్బంది విధులకు హాజరైనా, విద్యా సంస్థలు తెరవబడి ఉన్నా ఆ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here