హైదరాబాద్, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): తమ జిల్లా బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా కొండ పోచమ్మ సాగర్ ద్వారా కాళేశ్వర జలాలను విడుదల చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ధన్యవాదాలు తెలిపారు మెదక్ జిల్లా నేతలు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నాయకత్వంలో ఎంపీలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మాణిక్ రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే, నిజాం సాగర్‌కు కాళేశ్వర జలాలను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ జిల్లా నేతలు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, డి. రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ జిల్లాకు మేలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.