మొత్తానికి మీడియా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ వ్యవహారం రాష్ట్రంలో ఒక వర్గాన్ని ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ అమలులో ఉన్న సంప్రదాయానికి భిన్నంగా ఎంపికచేసిన ప్రభుత్వ విభాగాల అధికారులతో క‌మిటీల‌ను ఏర్పాటుచేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల జర్నలిస్టులలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్ర‌భుత్వ చ‌ర్య కొంత‌మంది జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మోదం, మరి కొందరికి ఖేదం కలిగించింది. జ‌ర్న‌లిస్ట్ సంఘాలను పక్కనపెడుతూ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్‌ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ)ని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్ధాయి కమిటీ (డీఎంసీఏ)ని ఏర్పాటుచేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది.

అధికారులతో కమిటీ ఏర్పాటుపై 2020 డిసెంబర్ 8న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ జారీచేసిన జీవో ఎంఎస్ నెం. 123

యితే, ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన జర్నలిస్టు సంఘాల నేతలు పెద్దగా స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా, జ‌ర్న‌లిజ‌మే ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా కొనసాగుతున్న వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగితిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించకుండా, అధికారంలో ఎవరుంటే వారి దగ్గర కొన్ని సంఘాల నేత‌లు సాగిల పడి, భజనపరులుగా మారిపోతూ జ‌ర్న‌లిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్ర‌త్య‌ర్ధి సంఘాలను రూపుమాప‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఇటువంటి చ‌ర్య‌ల వ‌ల‌న జ‌ర్న‌లిస్ట్ సంఘాల మధ్య సమన్వయం కొర‌వ‌డి ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకోవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాల‌వ‌ల‌నే రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఏర్ప‌డింద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మీడియా అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి ఏ ఏ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నది స్పష్టంచేస్తూ 2020 సెప్టెంబర్ 15న జారీచేసిన జీవో ఎంఎస్ నెం. 98

కొంత మంది సంఘ వ్య‌తిరేక శ‌క్తులు జ‌ర్న‌లిస్ట్ సంఘాల‌లో జొర‌ప‌డి మీడియా మాఫియాను రాష్ట్రంలో సృష్టించారన్న ప్రచారం లేకపోలేదు. డొక్క చింపితే అక్ష‌రం ముక్క రాని వారు సైతం ముఖ్య‌మంత్రి నుండి జిల్లా క‌లెక్ట‌ర్ల వ‌ర‌కు నిర్వ‌హించే ముఖ్య‌మైన ప్రెస్ మీట్ల‌లో ముందు వ‌రుస‌లో కూర్చుని అసంద‌ర్భ ప్ర‌శ్న‌లు సంధిస్తూ, వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు రోత పుట్టిస్తున్న సంఘ‌ట‌న‌లు రాష్ట్రంలో కోకొల్ల‌లు. అక్రిడిటేష‌నే ఆయుధంగా కొంత‌మంది మాఫియా లీడ‌ర్లు బ్లాక్‌మెయిలింగ్ ముఠాలుగా ఏర్ప‌డి అన్ని స్థాయిల‌లో అందిన కాడికి దోచుకు తింటున్నారన్న విమర్శా ఉంది. గ‌తంలో ‘బ్ర‌త‌క‌లేక బ‌డిపంతులు’ అనే సామెత‌కు బ‌దులు, వ‌ర్త‌మానంలో ‘బ్ర‌త‌క‌లేక జ‌ర్న‌లిస్ట్‌’గా అవ‌తారం ఎత్తాడు అంటున్నారు. దీనిని బ‌ట్టి చూస్తే ఎందుకు ప‌నికిరాని, ప‌నీ పాట లేని వారు సైతం ఏదో ఒక పేప‌రు/టీవీ పంచ‌న చేర‌డం, ఆయా యాజ‌మాన్యాలు సెంట‌ర్‌ను బ‌ట్టి విధించే నెలవారీ వ‌సూళ్ల కోసం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌డం చూస్తూనే ఉన్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి 2019 నవంబర్ 20న జారీచేసిన మార్గదర్శకాలతో కూడిన జీవో ఎంఎస్ నెం. 142

సందర్భానుసారం వినియోగించిన చిత్రం

టార్గెట్‌ల‌ను పూర్తిచేయ‌ని వారిని వెళ్ళ‌గొట్ట‌డంతో ‘తిన‌మ‌రిగిన ….. దారికాచిన‌ట్టు’ స్వంతంగా ఒక యూట్యూబ్ ఛాన‌ల్‌ను సునాయాసంగా ఏర్పాటు చేసేసుకుని ప్ర‌జ‌ల‌పై ప‌డ‌డం ష‌రా మామూలైపోయింది. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగి ప్ర‌స్థుత కాలంలో కాంప్లిమెంట‌రీ కాపీలో లేక, ఆన్‌లైన్ ఎడిషన్‌ (ఈ-పేపర్)లకో మాత్రమే ప‌రిమిత‌మైపోయిన ప‌లు దిన‌ప‌త్రిక‌లు ప్ర‌భుత్వప‌రంగా వ‌చ్చే రాయితీల‌ను దండుకోవ‌డంతో పాటుగా ఉనికిని కాపాడుకోవ‌డం కోసం కొన్ని రెగ్యుల‌ర్ దిన‌ప‌త్రిక‌లకు సంబంధించిన‌ ప్రింటింగ్ ప్రెస్‌ల‌తో ఒడంబ‌డిక చేసుకుని పుంజీడు పేప‌ర్ల‌ను ముద్రించి, ఒక్కో జిల్లా కేంద్రంలో ప‌ట్టుమ‌ని ప‌ది కాపీలు కూడా అమ్మ‌లేని స్థితిలో ఉండి కూడా ఒక్కో జిల్లాలో సుమారు 60 నుండి 80 వ‌ర‌కు మీడియా అక్రెడిటేష‌న్లు పొందుతూ వాటిని విక్ర‌యిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నాయి.

క చిన్న ప‌త్రిక‌లైతే మీడియా అక్రిడిటేష‌న్‌కు ముందు మూడు నెల‌ల (ఒక్కో జిల్లాలో ఆరు నెలలు) పాటు స‌మాచార శాఖ‌లో హాజ‌రు కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డి పేప‌రును ముద్రించి అర‌కొర అక్రిడిటేష‌న్లు పొందిన త‌రువాత క‌నుమ‌రుగైపోవ‌డం జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇటువంటి వాటికి చెక్ పెట్ట‌డం కోసం గత ప్ర‌భుత్వం హ‌యాంలోనే స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ ఆధ్వ‌ర్యంలో ఒక ఉప‌ సంఘాన్ని ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఏర్పాటు చేయ‌డం, వారిచ్చిన సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌డానికి స‌మాచార శాఖ ప్ర‌య‌త్నించింది. అయితే, క‌మిటీ సిఫార‌సులు మీడియా గొంతు నొక్కేవిధంగా ఉన్నాయంటూ అప్పట్లో కొన్ని జ‌ర్న‌లిస్ట్ సంఘాలు నానా యాగీ చేసాయి. మీడియా అక్రిడిటేష‌న్ పొదాలంటే క‌నీస విద్యార్హ‌త ప‌ద‌వ‌ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌లు క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయంటూ రాష్ట్రంలోని యావ‌త్ జ‌ర్న‌లిస్ట్ సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టి ఉప సంఘం సిఫార‌సులను బుట్ట‌దాఖలాచేయ‌డంలో విజ‌యం సాధించాయి.

ప్ర‌తి ఏటా రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేష‌న్ల పందేరంలో అర్హ‌త ఉన్నా, లేక‌పోయిన అడిగిన‌న్ని అక్రిడిటేష‌న్ల‌ను మంజూరుకు దోహ‌ద‌ప‌డుతూ, ప్ర‌తీ ఏటా త‌మ ఖ‌జానాల‌ను నింపుకుంటున్న కొంత మంది యూనియ‌న్ నాయ‌కుల‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యం మింగుడు ప‌డ‌డంలేదు. అక్రిడిటేష‌న్ల మంజూరు మాట ఎలా ఉన్నా రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా క‌మిటీల‌లో స‌భ్యుడుగా స్థానం క‌ల్పించ‌డానికి ల‌క్ష నుండి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు రేటు పెట్టి మ‌రీ విక్ర‌యాలు సాగించారు కొంత‌మంది యూనియ‌న్ నేత‌లు అన్న ఆరోపణలు కూడా ఉన్నయి. అయితే, ఈ మొత్తాలు నగదు రూపంలో కాకపోయినా, యాడ్లు, ఇతరత్రా తాయిలాల రూపంలోనూ ఉన్నయి.

‌క్ష‌లు పెట్టి కొనుక్కున్న అక్రిడిటేష‌న్ క‌మిటీ ప‌ద‌విని అడ్డుపెట్టుకుని ఖ‌ర్చు చేసిన డ‌బ్బుకు రెండు రెట్లు సంపాదించ‌డానికి వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌ల‌ను గాలికొదిలేసి గ్యాంబ్లింగ్ లీడ‌ర్లు, చోటా పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు అక్రిడిటేష‌న్ల‌ను క‌ట్ట‌బెట్టారన్న విమర్శలు రెండేళ్ల క్రితమే వెల్లువెత్తాయి. ఈ క్రతువులో జిల్లా స్థాయిల‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొంత మంది యూనియ‌న్ నేత‌లు కీలకపాత్రపోషించారని సమాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ ఏదో ఒక యూనియ‌న్ నేత‌ల ప్రాప‌కంతో మీడియా అక్రిడిటేష‌న్లు సంపాదించిన వారి దృష్టి క‌మిటీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అధికార్ల‌ను ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో నిమగ్న‌మ‌య్యారు.

‌రి కొంత మంది ఒక అడుగు ముందుకేసి సామాజిక వ‌ర్గాల పేరిట అధికార్ల‌ను కాకా ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. నూత‌న మీడియా అక్రిడిటేష‌న్ నిబంధ‌న‌లు రాష్ట్రంలో ప్ర‌చురించే ప‌లు పెద్ద, చిన్న‌ దిన‌ప‌త్రిక‌లతో పాటుగా, శాటిలైట్‌, కేబుల్ టీవీల‌కు అక్రిడిటేష‌న్ల మంజూరుకు ప్ర‌తిబంధకంగా త‌యార‌య్యాయ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు వ్యాఖ్యానించారు. జీవో నెం. 142 ప్ర‌కారం దిన‌ప‌త్రిక‌లు క‌నీసం రెండు వేల కాపీల‌ను ముద్రించి సర్క్యులేషన్ (పెయిడ్ కాపీలు) వార్షిక నివేదిక రూపంలో చూపించడంతో పాటు, సంబంధిత ఆడిట్ రిపోర్టుకు ఆధారంగా జీఎస్టీ రిటర్న్ సమర్పిస్తేనే అక్రిడిటేష‌న్‌లు పొంద‌డానికి అర్హ‌త సాధిస్తాయి.

లాగే సంబంధిత ప‌త్రిక స‌ర్య్కులేష‌న్‌ను నిర్ధారిస్తూ ఆటిట్ బ్యూరో ఆఫ్ స‌ర్య్కులేష‌న్ (ఏబీసీ) లేదా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేప‌ర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) మంజూరు చేసే స‌ర్టిఫికేట్‌ను త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పత్రిక ఏర్పాటుచేసిన మొదటి మూడేళ్ల వరకు చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరణ అంగీకరించే వెసులుబాటు ఉన్నప్పటికీ మూడేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన పత్రికలు మాత్రం విధిగా ఏబీసీ లేదా ఆర్ఎన్ఐ సర్క్యులేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంది.

క్కమాటలో చెప్పాలంటే, జి.ఎస్‌.టి పెద్ద, చిన్న ప‌త్రికల పాలిట గుదిబండ‌గా త‌యారైంది. జి.ఎస్‌.టి. రిట‌ర్న్స్‌లో చందాదారుల వివ‌రాలతో పాటుగా, రోజువారీ ప్ర‌తిక ముద్ర‌ణ‌కు కావ‌ల‌సిన న్యూస్ ప్రింట్‌, ఇంక్, సిబ్బంది జీత భ‌త్యాలు, ఇ.ఎస్‌.ఐ., ఇ.పి.ఎఫ్‌, విద్యుత్ వాడ‌కం, ట్రాన్స్‌పోర్ట్ త‌దిత‌ర ఖ‌ర్చుల‌ను రిట‌ర్న్స్‌గా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓ నాలుగైదు ప‌త్రిక‌లు మాత్ర‌మే జి.ఎస్‌.టి రిట‌ర్న్స్ కచ్చితంగా దాఖ‌లు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కొన్ని పత్రికలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించినా రిటర్న్స్ సమర్పించనవే ఎక్కువ శాతం. గత ఏడాది అక్రిడిటేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభ సమయంలో కొన్ని పత్రికలు హడావిడిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై దృష్టిపెట్టాయి. దారుణం ఏమిటంటే ఇటు, ఐ అండ్ పీఆర్‌లో, అటు డీఏవీపీలో ఏళ్ల తరబడి ఎంపానెల్‌మెంట్ జాబితాలో కొనసాగుతున్న పత్రికల్లో దాదాపు మూడొంతులకు పైగా ఇప్పటికీ చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) సర్టిఫికేట్లతోనే నెట్టుకువస్తున్నారని సమాచారం.

జి.ఎస్‌.టిని ప‌క్క‌న పెడితే 75 వేల కాపీలు క‌న్నా త‌క్కువ స‌ర్య్యులేష‌న్ క‌లిగిన దిన ప‌త్రికకు ఒక్కో సెంట‌ర్‌లో క‌నీసం రోజుకు వంద కాపీలు అమ్మకాలు జ‌రిగిన‌ట్లుగా ఆధారాలు చూపించాలి. మండ‌ల స్థాయిలో అక్రిడిటేష‌న్ పొందాలంటే అక్రిడిటేష‌న్ పొందే తేదీకి ముందు మూడు నెల‌ల‌పాటు నెల‌కు ప‌ది పేప‌ర్ క్లిప్పింగ్‌లు స‌మ‌ర్పించాలి. అలాగే మీడియా అక్రిడిటేష‌న్ పొందేవారు పూర్తి స్థాయి జ‌ర్ప‌లిజం వృత్తిలోనే ఉండాలి, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌తో పాట‌గా ఎటువంటి ఇత‌ర సంస్థ‌ల‌లో ఉద్యోగిగా ప‌ని చేయ‌రాదు.

‌త్రికా రంగానికి బ‌దులు ఏ ఇత‌ర ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి మీడియా అక్రిడిటేష‌న్ పొంద‌డానికి అన‌ర్హుడుగా క‌మిటీ ప్ర‌క‌టిస్తుంది. ఇక న్యూస్ ఛాన‌ల్స్ విష‌యానికి వ‌స్తే, నూత‌న విధానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి 24 గంట‌ల పాటు తెలుగులో ప్ర‌సారాలు చేసే శాటిలైట్ ఛాన‌ల్స్‌కు జిల్లా స్థాయిలో ఇద్ద‌రు రిపోర్టర్లు ఇద్ద‌రు వీడియో గ్రాఫ‌ర్ల‌తో పాటుగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక రిపోర్ట‌ర్ ఒక వీడియో గ్రాఫ‌ర్‌కు అక్రిడిటేష‌న్లు మంజూరు చేయ‌వ‌చ్చు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న శాటిలైట్ ఛాన‌ల్స్ బ‌హుశా లేవ‌నే చెప్ప‌వ‌చ్చు.

‌రి హైదరాబాద్ ప్ర‌ధాన‌ కేంద్రంగా ప్ర‌సారాలు నిర్వ‌హిస్తూ విజ‌య‌వాడ‌లో కార్యాల‌యాలు నిర్వ‌హిస్తున్న శాటిలైట్ ఛాన‌ల్స్‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం అక్రిడిటేష‌న్‌లు మంజూరు అవుతాయో లేదో వేచి చూడాలి. ఎ.పి.ఫైబ‌ర్, ఇతర ఎం.ఎస్‌.ఓల పుణ్య‌మా అని పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌చ్చిన ప‌లు కేబుల్, క్లౌడ్ ఛాన‌ల్స్‌కు కేబుల్ టెలివిజ‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్ ప్ర‌కారం చూస్తే మీడియా అక్రిడిటేష‌న్ మంజూరు క‌ష్టంగానే క‌నిపిస్తుంది. భార‌త స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ వ‌ద్ద డిజిట‌ల్ కేబుల్ టి.వి నిర్వ‌హించ‌డానికి మ‌ల్టీ సిస్టం ఆప‌రేట‌ర్ (ఎం.ఎస్‌.ఓ)గా న‌మోదైన సంస్థ‌లు స్వంతంగా కేబుల్ టి.వి సేవ‌ల‌ను అందిస్తూ ఉంటే మీడియా అక్రిడిటేష‌న్‌లు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంది. పోస్టాఫీస్‌ల‌లో ఐదు వంద‌ల రూపాయ‌లు చెల్లించి లోక‌ల్ కేబుల్ ఆప‌రేట‌ర్ (ఎల్‌.సి.ఓ)గా న‌మోదు చేసుకుని ఎం.ఎస్‌.ఓల వ‌ద్ద నుండి డిజిట‌ల్‌ సిగ్న‌ల్స్ తీసుకుని వినియోగ‌దారుల‌కు అందించే లోక‌ల్ కేబుల్ ఆప‌రేట‌ర్ (ఎల్‌.సి.ఓ)లు ఇప్ప‌టివ‌ర‌కు కేబుల్ టి.వి.ల పేరిట మీడియా అక్రిడిటేష‌న్లు పొందుతూ వ‌చ్చారు. నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం దేశంలో కేబుల్ టి.వి.ల‌ను డిజిట‌లైజేష‌న్ పేరిట కండీష‌న‌ల్ యాక్సెస్ సిస్టం పేరిట నూత‌న విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

విధానంలో టెలివిజ‌న్ ప్ర‌సారాలు నిర్వ‌హించ‌డానికి విధిగా భార‌త స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) వ‌ద్ద డిజిట‌ల్ కేబుల్ టి.వి . నిర్వ‌హించ‌డానికి మ‌ల్టీ సిస్టం ఆప‌రేట‌ర్ (ఎం.ఎస్‌.ఓ)గా రిజిష్ట‌ర్ అయి స్వంత డిజిట‌ల్ టి.వి. నెట్‌వ‌ర్క్ త‌ప్ప‌నిస‌రి. అక్రిడిటేష‌న్‌ల మంజూరుకు శాటిలైట్ ఛాన‌ల్స్‌కు ఒక నిబంధ‌న అడ్డంగా మారుతూ ఉంటే కేబుల్ టి.వి.ల‌కు మరో నిబంధ‌న ప్ర‌తిబంధ‌కంగా మారుతుంది. ఇన్ని క‌ఠిన త‌ర‌మైన నిబంధ‌న‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ జీఓ 142 విడుద‌ల చేస్తే ఘ‌న‌త వ‌హించిన జ‌ర్న‌లిస్ట్ సంఘాలు అక్రిడిటేష‌న్ క‌మిటీల‌లో స్థానాల కోస‌మే తాప‌త్ర‌యప‌డ్డారు కానీ, క‌ఠినత‌ర‌మైన నిబంధ‌న‌ల‌తో త‌యారైన జీఓ 142 చ‌దివి ఉండ‌క‌పోవ‌చ్చంటున్నారు ప‌లువ‌రు జ‌ర్న‌లిస్టులు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పనిచేస్తున్న వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ప్ర‌తి ఏటా మంజూరు చేసే మీడియా అక్రిడిటేష‌న్ల మంజూరులో తీవ్ర జాప్యం జ‌రుగుతుండ‌డంతో జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ప్ర‌భుత్వప‌రంగా అందాల్సిన హెల్త్ ఇన్య్సూరెన్స్ త‌దిత‌ర‌ రాయితీలు అంద‌క ప‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతూ వ‌స్తున్నారు. గ‌తంలో రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీల‌లో ప్రాతినిధ్యం వ‌హించిన 5 జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు బ‌దులుగా రాష్ట్రంలో సంఖ్యాప‌రంగా పెద్ద సంఘాలైన రెండు సంఘా‌ల‌కు క‌మిటీల‌లో చోటు క‌ల్పించి, మిగిలిన మూడు సంఘాల‌కు స‌మాచార శాఖ రిక్తహ‌స్తాలు చూప‌డంతో మనుగ‌డ‌కోసం మిగిలిన సంఘాలు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డాయి.

మీడియా క‌మిటీల‌లో చోటుద‌క్కించుకున్న కొంత మంది యూనియ‌న్ల‌ నేత‌ల ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండాపోయింది. త‌మ క‌త్తుల‌కు రెండు వైపులా ప‌దున‌న్న‌ట్టు రాష్ట్రంలోని చిన్నా చిత‌క ప‌త్రిక‌ల యాజ‌మాన్యాల‌తో పాటుగా, జ‌ర్న‌లిస్టులు త‌మ క‌నుస‌న్న‌ల‌లో మెలిగేలా పావులు క‌ద‌ప‌డం మొద‌లు పెట్టారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన రియ‌ల్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌లు ప్ర‌భుత్వ దృష్టికి ఆయా సంఘాల నేత‌ల‌ వికృత చేష్ట‌ల‌ను తీసుకుని వెళ్ళారు. జ‌ర్న‌లిస్ట్ సంఘాల మ‌ధ్య విభేదాల కార‌ణంగా మీడియా క‌మిటీల‌లో మిగిలి ఉన్న యూనియ‌న్‌ల ప్రాతినిధ్యాన్ని కూడా తొల‌గిస్తున్న‌ట్లు స‌మాచార శాఖ ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి క‌మిటీల‌ను కేవ‌లం అధికార్ల‌తో ఏర్ప‌టుకు సంబంధించిన అనుబంధ‌ జీఓను విడుద‌ల చేసారు. దీనితో రాష్ట్రంలోని జ‌ర్న‌లిస్టుల‌ను త‌మ చెప్పు చేత‌ల‌లో పెట్టుకుని ఆడింద‌ల్లా ఆట‌గా వ్య‌వ‌హ‌రించాల‌నుకున్న యూనియ‌న్ నేత‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది స‌మాచార శాఖ నిర్ణ‌యం.

‌ర్న‌లిస్టుల ఈతి బాధ‌లు జ‌ర్న‌లిస్టుల‌కే తెలుస్తాయి. కాబ‌ట్టే అక్రిడిటేష‌న్ క‌మిటీల‌లో జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వ‌ల‌న రియ‌ల్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా పెద్దా చిన్నా తార‌త‌మ్యాలు లేకుండా ప‌నిచేసే వారంద‌రికీ అక్రెడిటేస‌న్ మంజూరు జ‌రుగుతాయ‌నేది ఒక వ‌ర్గం జ‌ర్న‌లిస్ట్‌ల వాద‌న‌. జ‌ర్న‌లిస్టుల ప్రాతినిధ్యం లేని క‌మిటీల‌లో అధికారులే మీడియా సంస్థ‌ల అర్హ‌త‌ల‌ను నిర్ధారించ‌డం వ‌ల‌న రాష్ట్రంలో సుమారుగా 95 శాతం మీడియా సంస్థ‌ల‌కు నూత‌న విధాన‌లు అమ‌లైతే అక్రిడిటేష‌న్లు గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తుంది. జీఓలోని క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌ల‌ను అధికారులు తూఛ త‌ప్ప‌కుండా పాటించ‌కుండా గ‌త క‌మిటీల‌లానే జ‌ర్న‌లిస్ట్ సంఘాలు/రాజ‌కీయ నేత‌ల సిఫార‌సు లేఖ‌ల‌తో అన‌ర్హుల‌కు అక్రెడిటేష‌న్లు గాని మంజూరు చేసిన‌ట్ల‌యితే రేప‌టి రోజున నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మీడియా అక్రిడిటేష‌న్లు మంజూరు చేసార‌ని ఎవ‌రైనా కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తే క‌మిటీకి సార‌ధ్యం వ‌హిస్తున్నఅధికారుల మెడ‌కు ఉచ్చు బిగిసుకుంటుంది.

గ‌తంలో ప‌లు మీడియా సంస్థ‌లు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోయిన‌ప్ప‌టికిన్నీ క‌మిటీలోని యూనియ‌న్ ప్ర‌తినిధుల చొర‌వ‌, రాజ‌కీయ నాయ‌కుల సిఫార‌సు లేఖ‌ల‌తో కావ‌ల‌సిన వారికి కావ‌లసిన‌న్ని అక్రిడిటేష‌న్లు ద‌క్కించుకునేవారు. నూత‌న జీఓ పుణ్య‌మా అని ఇప్పుడు ఆ దారులు మూసుకుపోయాయి. మెడ‌లో లైసెన్స్ (అక్రిడిటేష‌న్ కార్డు) బిళ్ళ వేసుకుని కొన్ని సంద‌ర్భాల‌లో అధికార్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లుగా క‌నిపిస్తాయి. ఇప్పుడు అదే లైసెన్స్ బిళ్ళ మంజూరు చేయ‌డానికి ఆ అధికార్ల‌కే అధికారం చేజిక్క‌డంతో కొంత మంది జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి అడ‌క‌త్తెరలో పోక చెక్క చందాన త‌యార‌య్యింది.

‌రికొంత మంది ఒక అడుగు ముందుకేసి క‌మిటీలోని అధికార్ల‌ను సామాజిక వ‌ర్గాల పేరిట ప్ర‌శ‌న్నం చేసుకుని అక్రిడిటేష‌న్‌లు పొంద‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌ర్న‌లిజం వృత్తిపైనే ఆధార‌ప‌డిన కొన్ని చిన్న ప‌త్రిక‌లు త‌మ ఉనికిని కాపాడుకోవ‌డం కోసం అష్ట క‌ష్టాలు ప‌డుతూ ప‌త్రిక‌ను నిర్వ‌హిస్తూ ఉంటే వాటికి నిబంధ‌న‌ల పేరిట అక్రిడిటేష‌న్ల మంజూరులో మోకాల‌డ్డేసి, అక్రిడిటేష‌న్‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిశీల‌నార్హానికి నోచుకోని ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన కాంప్లిమెంట‌రీ దిన ప‌త్రిక‌ల‌కు ఒక్కో దానికి మాత్రం జిల్లాకు సుమారు 60 అక్రిడిటేష‌న్లు మంజూరు చేయించుకోవ‌డంలో యూనియ‌న్ నేత‌ల కృత‌కృత్యుల‌య్యేవారు. ఇప్పుడు నూత‌న అక్రిడిటేష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం చిన్నా పెద్దా తార‌త‌మ్యం లేకుండా అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తే త‌మ‌కు అభ్యంత‌రం లేదంటున్నారు జ‌ర్న‌లిస్ట్‌లు. అంతేకాని పెద్ద ప‌త్రిక‌ల‌కు నిబంధ‌న‌లు స‌డ‌లించి, చిన్న ప‌త్రిక‌ల‌కు మొండి చెయ్యి చూపిస్తే మాత్రం ప్ర‌తిఘ‌ట‌న‌కు సిద్ధ‌మౌతున్నారు చిన్న ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలు.

నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే మాత్రం అంద‌రికీ స‌మ‌న్యాయం పాఠించాల‌ని కోరుతున్నారు జ‌ర్న‌లిస్టులు. ఇప్ప‌టికే యూనియ‌న్ నేత‌ల అరాచ‌కాల‌పై చిర్రెత్తుకొచ్చిన కొంత మంది రియ‌ల్ జ‌ర్న‌లిస్ట్‌లు 2021-22 సంవ‌త్స‌రానికి మంజూరు చేసే మీడియా అక్రెడిటేష‌న్‌ల విధానంలో జీఓ నెం.142 విధి విధానాల‌ను తూఛ త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌క‌పోతే న్యాయ పోరాటానికి సిద్ధ‌మౌతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం.

(* ‘పవర్ న్యూస్’ సౌజన్యంతో…)