హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): స‌హ‌జ వ‌న‌రుల అభివృద్దిలో భాగంగా యాదాద్రి మోడ‌ల్‌లో భారీ ఎత్తున వివిధ ర‌కాల మొక్క‌ల‌ను ఏపుగా పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పార్కుగా 10 ఎక‌రాల విస్తీర్ణంలో 2 ల‌క్ష‌ల మొక్క‌లు నాటేందుకు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తార‌క‌రామారావు పుట్టిన రోజు సంద‌ర్భంగా జిహెచ్‌ఎంసి శ్రీ‌కారం చుట్టింది. ఎల్బీన‌గ‌ర్ జోన్ కొత్త‌పేట పoడ్ల మార్కెట్ వెనుక ఉన్న విక్టోరియా మెమోరియ‌ల్ హోం ట్ర‌స్ట్‌కు చెందిన 10 ఎక‌రాల స్థ‌లాన్ని యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్‌కు స్వ‌చ్ఛందంగా కేటాయించారు. ఆ స్థ‌లంలో ఆధునిక ప‌ద్ద‌తిలో నాలుగు వ‌రుస‌ల‌లో ఎత్తుగా పెరిగే చెట్లు, మ‌ధ్య‌స్తంగా పెరిగే చెట్లు, చిన్న‌గా పెరిగే చెట్ల‌ను మూడు వ‌రుస‌లుగా నాటుతారు.

త‌దుప‌రి ఆ చెట్ల మ‌ధ్య‌లో మెడిసిన‌ల్ ప్లాంట్లు, పూల మొక్క‌ల‌ను పెంచుతారు. ఈ మోడ‌ల్‌లో స‌హ‌జ అడ‌వుల‌ను త‌ల‌పించే చెట్లు రెండు సంవ‌త్స‌రాల్లో ఏపుగా పెరిగి ద‌ట్ట‌మైన అడ‌వులుగా మారతాయి. ఈ అడ‌వుల‌తో ఈ ప్రాంతంలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అందులో భాగంగా మంత్రి కె.టి.ఆర్ పుట్టిన‌రోజు కానుక‌గా గురువారం యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ కింద రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.స‌బితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌లు మొక్క‌లు నాటి ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ నెల 31 వ‌ర‌కు రెండు ల‌క్ష‌ల మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసేందుకు అధికారులు ప‌నుల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ కింద 1

0 ఎక‌రాల స్థ‌లంలో నాటేందుకు తీసుకువ‌చ్చిన 51 ర‌కాల మొక్క‌ల‌ను వారు ప‌రిశీలించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్ర‌స్తుతం త్రాగేందుకు నీటిని కొంటున్నామ‌ని, ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే భ‌విష్య‌త్‌లో ఆక్సిజ‌న్ కూడా కొనుగోలు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుందని భావించిన ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ముందు చూపుతో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్లు తెలిపారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మంచి వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాల‌నే సంక‌ల్పంతో యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్‌కు స్థ‌లాన్ని కేటాయించిన వి.ఎం.హోం ట్ర‌స్ట్‌ను అభినందించారు.రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.ఆర్.కు పుట్టిన రోజు కానుక‌గా ఈ ప్లాంటేష‌న్ ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని అతిపెద్ద యాదాద్రి మోడ‌ల్ పార్కుగా ఈ స్థ‌లాన్ని అభివృద్ది చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌చ్చ‌ద‌నం పెంపుద‌ల‌లో, మొక్క‌ల సంర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ ప్లాంటేష‌న్ వ‌ల‌న ఈ ట్ర‌స్ట్‌కు సంబంధించిన భూమికి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తెలిపారు. గ‌తంలో చెత్త‌చెదారంతో ఉండేద‌ని చెప్పారు. యాదాద్రి మోడ‌ల్‌తో చుట్టుప్ర‌క్క‌ల ప్ర‌జ‌లకు ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణం పెంపొందుతుంద‌ని తెలిపారు. ఈ సందర్బంగా జిహెచ్‌ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు పుట్టిన రోజు సంద‌ర్భంగా స్మైల్ ఏ గిఫ్ట్ కింద ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అందించుట‌కు అతిపెద్ద యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దికి కృషిచేస్తున్న మంత్రి కె.టి.ఆర్‌కు పుట్టిన‌రోజు కానుక‌గా ఈ ప్లాంటేష‌న్ నిలుస్తుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన‌రిని పెంపొందించేందుకు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ రూపొందించిన‌ట్లు తెలిపారు. హ‌రిత‌హారంలో ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. దట్ట‌మైన అడ‌వుల‌ను న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందించుట‌లో భాగంగా ఈ 10 ఎక‌రాల్లో యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ పార్కును అభివృద్ది చేస్తున్న‌ట్లు తెలిపారు. నాటిన ప్ర‌తి మొక్క‌ను కాపాడుట‌కు ప్ర‌త్యేకంగా సిబ్బందిని నియ‌మించి మానిట‌రింగ్ చేయాల‌ని అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అధికారుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ అనిత ద‌యాక‌ర్‌రెడ్డి, ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి, అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here