ఐకేపీ ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి

61

నారాయణఖేడ్, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి వ్యవసాయ, సహకార, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్‌లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు మద్దతుధర వచ్చేలా సహకరించాలని, తూకాలలో ఎలాంటి అవకతవకలు జరిగి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొనుగోలు కేంద్రంలో పరిస్థితులపై రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి పరిస్థితులు అన్నదాతలకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు.