స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): బాగ్ లింగంపల్లిలోని లంబాడీ బస్తీ వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంప్లెక్స్‌ ప్రాంగణంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రూ.18 వేల కోట్ల వ్యయంతో పేదలకు 2,72,000 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. పేదల ఆత్మగౌరవ సూచికగా ఈ ఇళ్ల సముదాయాల నిర్మాణం సాగుతోందన్నారు.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, వీటి కోసం సుమారు 9,714 కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నామన్నారు. లంబాడ బస్తీలో రూ.10.90 కోట్లతో నిర్మించిన 2 బీహెచ్‌కే ఇండ్లను నిర్మించామన్నారు. ఈ ఇళ్లను పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించి, ఒక్కో ఫ్లాట్‌కు రూ.9 లక్షలతో నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంగణాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా నిర్వహించాలని, రోడ్లు, నాలాలపై చెత్త వేయవద్దని, పేదలు సౌకర్యవంతమైన జీవితం గడపాలని, ఇతరులకు అమ్మడం, లేదా ఇతరులకు ఇవ్వడం చేయరాదని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పౌరులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్, శాసనసభ్యులు ముతా గోపాల్, కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.9.90 కోట్ల అంచనా వ్యయంతో, నారాయణగూడ క్రాస్ రోడ్డు వద్ద మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

4 COMMENTS

  1. Awesome blog! Is your theme custom made or did you download it from somewhere?
    A design like yours with a few simple tweeks would really make my blog stand out.
    Please let me know where you got your theme. Bless you

  2. Каким образом зайти на гидру? Таким моментом озадачены все участники гидры, каждый день необходимо разыскивать работающее зеркало гидры т.к. каждый день зеркала банятся правительством и входа к ресурсу нет, использовать VPN непросто и дорого, тор на английском языке, что также далеко не всем подходит. Специально для наибольшего облегчения этой задачи мы спроектировали этот сайт. Для раскрытия гидра сайт анонимных покупок Вам необходимо зайти по действующему рабочему зеркалу указанному перед этим либо скопировать гиперссылку для тор браузера которая также указана на нашем сайте и открыть ее в тор браузере, после этого зарегистрироваться, пополнить баланс и восторгаться покупкам. Не забывайте при этом содействовать развитию ресурса делитесь представленным интернет-ресурсом с приятелями и родственниками.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here