క్రీడాకారులకు మంత్రి అభినందనలు

1227

హైదరాబాద్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): ఆగ్రాలో జులై 27 నుండి 31 వరకు జరిగిన జాతీయ సబ్ జూనియర్, జానియర్ విభాగంలో టగ్ ఆప్ వార్ చాంఫియన్స్ షిప్‌లో తెలంగాణకు చెందిన టగ్ అప్ వార్ అసోసియేషన్‌కు చెందిన రెండు జట్లు అద్బుత ప్రదర్శన చేసి రెండు కాంస్య పథకాలు సాధించినందుకు క్రీడాకారులను సచివాలయంలో అభినందించారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. 25 రాష్ట్రాల నుండి పాల్గొన్న ఈ జాతీయ స్థాయి చాంపియన్స్ షిప్‌లో తెలంగాణ క్రీడా కారిణులు మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో పథకాలు తీసుకవచ్చినందుకు తెలంగాణ టగ్ ఆప్ వార్ అసోషియేషన్‌ను అభినందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడల అభివృద్దికి అనేక రకాలుగా ప్రోత్సాహన్ని అందిస్తున్నారన్నారు మంత్రి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావాలని అకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. భవిష్యత్తులో తెలంగాణ టగ్ ఆప్ వార్ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి మరిన్ని పథకాలు సాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టగ్ అప్ వార్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ ఇమాన్యుయల్, అర్గనైజింగ్ సెక్రటరీ జానికి రామ్‌లతో పాటు కోచ్‌లు రాఘవేంద్ర, యాదగిరిలకు అభినందనలు తెలిపారు.