పీఆర్‌కే ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్‌ను మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా పరిశీలిస్తున్న దృశ్యం

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీఆర్‌కే ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమా ఫోగ్రపీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి కరోన మహమ్మారి ప్రపంచంలోని ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిందని తెలిపారు.

ప్రజల భద్రతకై అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనా నిర్ములించేందుకు కష్టపడి కరోనా వాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 90 వేల మందికి కరోన వాక్సిన్ వేయనున్నామని, ముందుగా ఫ్రన్ట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేస్తారని, ఈ నెల 2న ఏడు సెంటర్లలో 8న 800 సెంటర్లలో కరోనా వాక్సిన్ వేయడానికి డ్రైరన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేయడానికి పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రయివేటు హాస్పిటల్‌లలో కూడా డ్రైరన్ నిర్వహిస్తున్నాయని పీఆర్కే హస్పిటల్లో 167 మంది వైద్య సిబ్బంది ఉన్నారని, ఈ హాస్పిటల్‌లో రోగులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని హాంగులతో కూడిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధి, పీఆర్‌కే హాస్పిటల్ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఎండీ పుట్టా రవికుమార్, డీఎంఎండ్‌హెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్ఓ సృజన, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here