బుడాన్ (యూపీ), అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్‌ బుడాన్‌లోని ఆలాపూర్ ప్రాంతంలో ఓ గ్రామంలో ఒక అల్లరి మూక దాడి చేసి, కాల్పులు జరిపినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన కాకరాలా గ్రామంలో జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న కానిస్టేబుళ్లు అశోక్ భదౌరియా, ఓపీ సింగ్‌లు గ్రామానికి చేరుకోగా, అనంతరం ఒక అల్లరిమూక వారిపై దాడి చేసి ఇటుక రాళ్లతో దాడి ప్రారంభించినట్లు ఏఎస్‌పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

దాడి సమయంలో భదౌరియాకు గాయాలు అయ్యాయని, వెళ్లిన ఇద్దరు పోలీసులలో ఒకరు గాయపడగా, దాడికి పాల్పడిన అల్లరి మూక ఒక రైఫిల్‌ను లాక్కొనివెళ్లే ప్రయత్నం చేసింది. అనంతరం సీనియర్ పోలీసు అధికారులు అదనపు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కానిస్టేబుల్ నుంచి తీసుకొని పోయిన రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బుడాన్ ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇతరులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్పించగా, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఎస్ఎస్‌పీ తెలిపారు.