న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోవిడ్‌-19 టీకా మందు తాలూకు రెండో డోసును ఈ రోజున తీసుకొన్నారు. ‘‘కోవిడ్‌-19 టీకా మందు రెండో డోసును ఎఐఐఎమ్ఎస్‌లో ఈ రోజున నేను తీసుకొన్నాను. వైర‌స్‌ పై చేయిని సాధించాలి అంటే, మ‌న ద‌గ్గ‌ర ఉన్న అతి కొద్ది మార్గాలలో టీకా వేయించుకోవ‌డం ఒక‌టి. మీరు గ‌నుక టీకా వేయించుకోవ‌డానికి అర్హులు అయిన ప‌క్షంలో, వెంట‌నే మీ సూది మందును తీసుకోండి. http://CoWin.gov.inలో మీ పేరు న‌మోదు చేసుకోండి’’ అని న‌రేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.