జమ్ములో జనసంచారం కొరవడిన దృశ్యం

లాక్‌డౌన్, ఆంక్షలతో ప్రజల్లో మానసిక కలవరం

కేసుల విచారణలో లోపించిన పారదర్శకత

జైళ్లల్లోనే మగ్గుతున్న వేలాది మంది… పీఎన్ఏ, యూఏపీఏ

చట్టాల దుర్వినియోగం… నేటికీ బందీఖానాలో నేతలు

కశ్మీర్ మానవహక్కుల ఫోరం నివేదికలో వెల్లడి

జమ్మూ, జులై 26: కరోనా మహమ్మారి కూడా విజృంభించడంతో జమ్మూకశ్మీర్‌లో 11 నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కాలంలో అనేకసార్లు మానవహక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌లోని మానవహక్కుల ఫోరం తాజా నివేదిక పేర్కొంది. గ్రూపు ఆఫ్ ఇంటర్ లొకుటర్స్ మాజీ సభ్యులు రాధాకుమార్‌తో పాటు సుప్రీంకోర్టు మాజీ జడ్జి మదన్ బి లోకుర్ ఈ ఫోరం కోచైర్మన్‌గా ఉన్నారు. ‘జమ్మూకాశ్మీర్: మానవ హక్కులపై లాక్‌డౌన్ల ప్రభావం’ పేరిట నివేదికను విడుదల చేసింది. అందులో ప్రజాభద్రతా చట్టం (పీఎన్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ)ల వంటి కఠిన చట్టాలు దుర్విని యోగానికి గురయ్యాయి. వీటిని అడ్డం పెట్టుకొని కేసుల విచారణను వేగవంతం చేయకుండా నిందితులకు బెయిల్ రాకుండా చేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో బారికేడ్లు, చెక్ పాయింట్ల వద్ద వేధింపుల పర్వం కొనసాగింది. కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు అమలయ్యాయి. వీటన్నింటి ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంది. కశ్మీరీలు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. మనోధైర్యాన్ని కోల్పోతున్నారు.

కశ్మీరు నగరంలో కరోనా లాక్‌డౌన్ పరిస్థితి…

జమ్మూ కాశ్మీర్, భారత రాజ్యాంగాల ప్రకారం ఆరోగ్యం, వైద్యసంరక్షణ హక్కులు సైతం అతిక్రమణకు గురవుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత విధించిన ఆంక్షల ప్రభావం విద్యావ్యవస్థపై పెను ప్రభావం చూపింది. 2019 నుంచి ఇక్కడ విద్యా సంస్థలు కనీసం 100 రోజులు కూడా సరిగ్గా పనిచేయలేదు. 2జీ సేవలను మాత్రమే అనుమతించడంతో ఆన్‌లైన్ బోధన అటకెక్కింది. రాష్ట్ర హోదా రద్దు చేసి జమ్మూకశ్మీర్, లడక్‌గా విభించించి, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రకటించిన మోడీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5 నిర్ణయంలో పాకిస్థాన్, చైనా జోక్యం ఉంది. ఈ మార్పులపై ఐరాస భద్రతా మండలిని కదలించే చైనా ప్రయత్నాలు, ఈ ఏడాది మేలో తూర్పు లఢక్‌లో సైన్యాన్ని మోహరించడం వంటి చర్యలతో భారత ప్రభుత్వానికి దౌత్య, భద్రతపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కశ్మీర్‌కు సంబంధించి భారత్, పాకిస్థాన్, చైనా మధ్య వివాదాన్ని త్రైపాక్షికం చేసే ప్రయత్నాలు జరిగాయి. పర్యవసానంగా చైనా-పాకిస్థాన్ ఏకమై జమ్మూకశ్మీర్ విషయంలో భారత్‌ను లక్ష్యం చేసుకున్నాయి అని పేర్కొంది. నాడు ప్రివెంటివ్ కస్టడీ (ముందస్తు అరెస్టు) పేరిట లోయలోని రాజకీయ నాయకులు అందరినీ నిర్బంధించారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంతులూ ఉన్నారు.

వారందరినీ తక్షణమే విడుదల చేయాలి. పీఎన్ఏ చట్టాన్ని రద్దు చేయాలి లేదా సవరించాలి. లేనిపక్షంలో రాజకీయ విపక్షాలపై వాటిని దుర్వినియోగించే వీలుంటోంది. భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలను ఎత్తివేయాలి. జువనైల్ రక్షణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి అని ఫోరం కోరింది. అరిక్టల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా తొలగింపు, దేశచరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోయలో కఠిన లాక్‌డౌన్ల అమలు, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభన, సామూహిక అరెస్టులను గుర్తు చేసింది. కశ్మీర్ ముగ్గురు మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫీలు అరెస్టు కాగా ఇటీవల ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు విడుదల కాగా ముప్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here