ఏయూకు శానిటైజర్ల బహూకరణ

47

విశాఖపట్నం, మే 21 (న్యూస్‌టైమ్): విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ఉపయుక్తంగా శానిటైజర్లను ఏయూ పాలక మండలి సభ్యులు కె.వి.ఎస్. ఆంజనేయవర్మ అందించారు. గురువారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి 500 శానిటైజర్లు, శానిటైజర్ స్టాండులను బహూకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ పూర్తిస్థాయిలో సేవలు అందించడం ప్రారంభించిందన్నారు. ఉద్యోగులు ఆరోగ్య బధ్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందన్నారు. పాలక మండలి సభ్యులు తమవంతు బాధ్యతగా వర్సిటీకి శానిటైజర్లు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.