నందమూరి బాలకృష్ణ తనయ, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పాలక మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బోర్డు చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.

‘‘మా ఆసుపత్రి రోగులు వారి క్యాన్సర్ యుద్ధంలో పోరాడటానికి సహాయం చేద్దాం.’’ అంటూ ఆయన అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ట్వీట్ చేశారు. ‘‘పిల్లవాడికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినప్పుడు అది కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మనం బలంగా ఉండి ఈ పరిస్థితిని కలిసి పోరాడాలి. పీడియాట్రిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అతి చిన్న యోధులు, నేను వారికి వందనం చేస్తున్నాను. వారి కోసం పోరాడుతున్న కుటుంబాలు, వైద్య సంరక్షణాధికారులు, నిపుణులు. చిన్న యోధులందరికీ మంచి ఆరోగ్యం, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటంలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను.’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.