వలస కార్మికుల సేవలో NARA

0
15 వీక్షకులు

శ్రీకాకుళం, మే 26 (న్యూస్‌టైమ్): నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఎఆర్ఎ) ఆధ్వర్యంలో వలస కార్మికులకు ఆహారం, మాస్క్‌లను పంపిణీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుకునేందకు కొందరు నడుచుకుంటా, మరికొందరు సైకిల్, వాహనాలపై ప్రయాణిస్తున్నారు.

మాస్క్‌లు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న ఎన్ఎఆర్ఎ ప్రతినిధులు
మాట్లాడుతున్న ఎన్ఎఆర్ఎ ఉపాధ్యక్షుడు డోల శంకర్రావు

లాక్‌డౌన్ కారణంగా వారికి ఆహారం దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఎఆర్ఎ) ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని పెద్దపాడు జాతీయ రహదారి వద్ద నడుచుకుంటూ, సైకిల్, బుస్సులపై తమ గమ్యస్థానాలకు వెళ్తున్న 230 మంది వలస కార్మికులకు, మాస్కులు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ‘నారా’ జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్ర బాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల శంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు వెళ్లుతున్న వలస జీవులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దండా చిన్నారావు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తూ వందల, వేల కిలోమీటర్ల జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లుతున్న వలస కార్మికుల పట్ల ప్రతి ఒక్కరూ తోచినంత సహాయాన్ని అందించాలని కోరారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా వలస కార్మికులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి జి . కృష్ణమూర్తి, ఆమదాలవలస నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎమ్. మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఎ. శ్రీనువాసరావు, ఎమ్.దినేష్, పి వాసుదేవరావు, పాత్రికేయులు జి. ఎజ్రా, చంద్రపతిరావు, శివ, కొండబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here