గిరిజనులకు ‘నారా’ ఆసరా

0
5 వీక్షకులు

గుంటూరు, మే 17 (న్యూస్‌టైమ్): నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ఎఆర్ఎ) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పెరలి గ్రామానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం, సముద్రానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో గుడిసెలలో నివసిస్తున్న గిరిజనులకు అన్నదానం నిర్వహించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తినడానికి తిండి లేక సమాజానికి దూరంగా బతుకుతున్న గిరిజనులకు నిత్యవసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ వింగ్ కమిటీ, గుంటూరు జిల్లా కమిటీ, బాపట్ల నియోజకవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్ర బాబు ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు చేతుల మీదగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడి గిరిజనులకు కరోనా మీద అవగాహన కల్పించి నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. బోటు నడుపుతున్న 6 గురు కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు మాట్లాడుతూ సమాజానికి దూరంగా బతుకుతున్న ఇటువంటి వారికి సహాయం చేస్తే సమాజ సేవకు అర్థం ఉంటుందని మనకు కూడా సంతృప్తి మిగులుతుందని మా యూనియన్ నాయకులు చెప్పిన తర్వాత ఎంత రిస్క్ అయినా మనం ఇటువంటి వారికి సేవ చేయాలని నేను కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు కావడం జరిగిందని,ఈ కార్యక్రమం మాకు అందరికీ చాలా సంతృప్తినిచ్చిందని, గిరిజనులు వారి పిల్లలు చాలా ఆనందపడ్డారని, వారికి మన చేతి తోటి భోజనం పెట్టే అదృష్టం తమ యూనియన్‌కు దక్కిందని సురేంద్ర బాబు అన్నారు. వీరి గురించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళడానికి లోకల్ యూనియన్ నాయకులు పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం రక్షణ అనే దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా సీనియర్ జర్నలిస్టులు,ఉరకలెత్తే యువ జర్నలిస్టుల సహకారంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A) ఆవిర్భవించిందని, యూనియన్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టులకి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తుంది. జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జర్నలిస్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టడానికి జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు కావాలని అనే ప్రధాన డిమాండ్లతో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రజా ప్రతినిధులను, ఉన్నత అధికారులను కలిసి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిందన్నారు.

జర్నలిజం మూలాలను బ్రతికించి, జర్నలిస్టుల విలువను పెంచడానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని సురేంద్రబాబు తెలియజేశారు. ఒకవైపు జర్నలిస్టుల సమస్యలపై జాతీయ స్థాయిలో అలుపెరుగని పోరాటం చేస్తూ కూడా, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజ సేవలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ప్రధాన భూమిక పోషిస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ -19 లాక్‌డౌన్‌తో 49 రోజుల నుంచి జర్నలిస్టులు, రోజువారి కూలి పని చేసుకునే పేద ప్రజలు పూట గడవడం కష్టంగా ఉన్నా ఈ తరుణంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ యూనియన్ నాయకులు కూరగాయలు, బియ్యం, నిత్యవసర వస్తువులు, మాస్కులు, శానిటీజర్స్ పంపిణీ కార్యక్రమాలు చేశారన్నారు.

వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా అత్యవసర సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు,ఆర్టీసీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు, ఫ్రూట్స్ అందజేశారన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నేషనల్ యాక్టివ్ రిపోటర్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ వింగ్, గుంటూరు జిల్లా కమిటీ, బాపట్ల నియోజకవర్గ కమిటీ, వి.ఎస్ పౌండేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు సురేంద్రబాబు. ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here