న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ 19వ తేదీ ఉదయం 11 గంటలకు విశ్వభారతి స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్, విశ్వభారతి రెక్టార్ జగదీప్ ధన్‌ఖార్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 2535 మంది తమ డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు.
విశ్వభారతి గురించి:
విశ్వభారతిని గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ 1921లో స్థాపించారు. దేశంలోని పురాతన కేంద్రీయ విశ్వవిద్యాలయం. అలాగే ఇది పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇతర ప్రాంతాలలోని ఆధునిక విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న ఫార్మెట్‌ను అనుసరిస్తున్నప్పటికీ ఈ విశ్వవిద్యాలయం గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించిన బోధన పద్థతిని అనుసరిస్తోంది.