న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (న్యూస్‌టైమ్): ముంబ‌యిలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగిన విష‌య‌మై ఈ రోజు తెల్లవారు జామున కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఈ మంత్రిత్వ శాఖల‌‌ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) ఆర్.ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ ‘‘విద్యుత్ సరఫరా (ముంబ‌యిలో) గణనీయంగా పునరుద్ధరించబడింది. 2000 మెగావాట్లలో మొత్తం 1900 మెగావాట్ల మేర స‌ర‌ఫ‌రా పునరుద్ధరించారు. మిగ‌తా ప్రాంతాల్లోనూ త్వరలో స‌ర‌ఫ‌రా పునరుద్ధరిస్తున్నారు. నేషనల్ గ్రిడ్‌కు ఏలాంటి ప్ర‌మాదం వాటిల్ల లేదు, స్టేట్ గ్రిడ్‌లోని కొన్నిప్రాంతాల్లో మాత్రం సమస్యలు ఏర్ప‌డ్డాయి. స‌ర‌ఫ‌రాలో అంత‌రాయ‌పు సమస్యను గుర్తించడానికి గాను, ఇలాంటి ప‌రిస్థితుల‌కు ఎదుర్కొనేందుకు సాధ్యమైన పరిష్కారాలను తెలుసుకోవడానికి కేంద్ర బృందం ముంబ‌యిని సందర్శిస్తుంది’’ అని సింగ్ అన్నారు.