న్యూఢిల్లీ, జనవరి 9 (న్యూస్‌టైమ్): నేషనల్ క్యాడెట్ కాప్స్‌ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ఐచ్ మాట్లాడుతూ యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్‌సిసి కట్టుబడి ఉందని, వారు దేశ నిర్మాణంలో ఎంతో కృషి చేస్తారని అన్నారు. 2021 జనవరి 08న న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ జనరల్ జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎన్‌సిసి క్యాడెట్ల బాలురు, బాలికలు పాల్గొంటారన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో 04 జనవరి 2021న ప్రారంభమైన రిపబ్లిక్ డే క్యాంప్, ఆర్‌డిసి -2021లో పాల్గొన్న వారి నుండి ఈ క్యాడెట్లను ఎంపిక చేస్తారు. 380 మంది బాలికలతో పాటు మొత్తం వెయ్యి మంది ఉన్న ఈ నెల రోజుల శిబిరంలో దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలనుండి పాల్గొంటున్నారు. పరెడ్‌లో పాల్గొనే క్యాడెట్లను అందించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన దేశం గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాలను చాటేలా చేయడమే రిపబ్లిక్ డే క్యాంప్ లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమం గణతంత్ర దినోత్సవం నుండి 28, జనవరి 2021న ప్రధాని ఎన్‌సీసీ క్యాంపును సందర్శించే వరకూ కొనసాగుతుందన్నారు.

ఈ శిక్షణలో క్యాడెట్లు సాధించిన నైపుణ్యాలు 28 జనవరి 2021న ప్రధానమంత్రి ముందు ప్రదర్శించబడతాయి. అది కవాతు చేసే బృందాలతో పాటు శక్తివంతమైన సాంస్కృతిక ప్రదర్శన అని ఆయన చెప్పారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపద్ యెశో నాయక్ 2021 జనవరి 28న క్యాంప్ ముగింపు కార్యక్రమానికి విచ్చేస్తారు. శిబిరానికి హాజరయ్యే క్యాడెట్లు, రాత పరీక్ష, ఆర్మ్స్ డ్రిల్, మైక్రోలైట్ ఫ్లయింగ్, ఉత్తమ క్యాడెట్ పోటీ వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శిబిరంలో అనేక పోటీలు జరుగుతాయి. జనవరి 28న స్వయంగా ప్రధాని చేతుల మీదుగా అందుకునే ప్రధానమంత్రి బ్యానర్ కోసం ఇందులోని మొత్తం 17 డైరెక్టరేట్లు పోటీపడతాయి. క్యాడెట్ల శిక్షణకార్యక్రమం మరింత మెరుగుపరచబడిందని, మన యువతలో మారుతున్న ఆకాంక్షలు, సమాజం అంచనాలకు అనుగుణంగా ఇప్పుడు శిక్షణా కార్యక్రమం ఉందని లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ఐచ్ అన్నారు.

భవిష్యత్ సవాళ్లకు వారిని సన్నద్ధం చేయడానికి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, క్యాడెట్ల నైపుణ్యాలను మెరుగుపరచడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించబడిందన్నారు. యువత సాధికారత, దేశ నిర్మాణం, సామాజిక ఆంశాలపై అవగాహన కార్యక్రమాలు, సమాజ అభివృద్ధి కార్యక్రమాలు, వాతావరణ పరిరక్షణ, ఆటలు, సాహస యాత్రలు వంటి రంగాలలో ఎన్‌సిసి సాధించిన ప్రధాన విజయాలను డిజి ఎన్‌సిసి ప్రముఖంగా ప్రస్తావించింది. కొవిడ్-19 సంక్షోభ సమయంలో 1,39,961 మంది క్యాడెట్లు మరియు 21,380 మంది సిబ్బంది సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ట్రాఫిక్ నిర్వహణ, ఆహార పంపిణీ మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ, లైన్ల నిర్వహణ మరియు సామాజిక సేవ వంటి వివిధ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా మాజీ ‘ఎన్‌సిసి యోగ్డాన్’ ఫ్రంట్‌లైన్ కరోనా యోధులుగా ఉన్నారు. భౌతిక దూరం పాటించేలా చూడ్డం, సరఫరా గొలుసు నిర్వహణ, సీనియర్ సిటిజన్లకు సహాయం, సిసిటివి కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ, ఆహార ప్యాకెట్ల తయారీ మరియు పంపిణీ, ఫేస్ మాస్క్‌ల తయారీ మరియు నిరుపేదలకు పంపిణీ మొదలైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలి కేరళ, బీహార్ వరద సహాయ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న ఎన్‌సిసి క్యాడెట్లను కూడా డిజి ఎన్‌సిసి అభినందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here