దరఖాస్తుదారులకు ముఖ్యగమనిక… ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ పంపిన వారు తమ వివరాలను పేర్కొంటూ తక్షణమే 6300795484 నంబరులో సంప్రదించి తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాల్సిందిగా మనవి. ఎంపికైన వారు, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారూ దయచేసి మళ్లీ మళ్లీ దరఖాస్తుచేయవద్దని ప్రత్యేక విజ్ఞప్ది.

చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. కాకపోతే, సరైన మార్గం, మార్గదర్శకం లేక వచ్చినా ఈ రంగంలో నిలదొక్కుకోలేక అవస్థలు పడేవారి సంఖ్యే ఎక్కువ. కేవలం తమ ఆదాయాన్ని పెంచుకోవడానికో, తమ పత్రికలను, ఛానళ్లనూ ప్రచారం చేసుకోవడానికో ఎక్కువ మంది ఔత్సాహిక పాత్రికేయులను పావులుగా వాడుకొని చివరికి కూరలో కరివేపాకులా ఎటూ కాకుండా వదిలేస్తుంటారు. ‘గొర్రె కసాయివాడినే నమ్ముతుంది’ అన్న చందంలా ఆ ఔత్సాహిక అమాయకులు కూడా అలాంటి వారినే నమ్మి ఎలాంటి ప్రయోజనం పొందకుండానే ఎడారిలో నావల్లా మిగిలిపోతుంటారు.

తమ కళ్లముందు జరిగే అన్యాయాన్ని, అక్రమాలనూ వార్తలుగా వెలుగులోక తేవాలన్న ఆసక్తి ఉన్నా ఏమీ చేయలేక కేవలం ప్రచారకర్తలుగానే మిగిలిపోయే వారూ మన మధ్యే అనేక మంది ఉన్నారు. అలాంటి వారు ఇకమీదట తమ ప్రతిభను తమలోనే దాచుకోవాల్సిన అవసరం ఉండదు. వీరికి ‘న్యూస్‌టైమ్’ అండగా నిలుస్తుంది. వారి ప్రతిభకు పదునుపెట్టి, అవాస్తవాలకు పాతరేసి నిజాలను నిర్భయంగా పాఠకలోకానికి పరిచయం చేస్తుంది.

కేవలం ఐడీ కార్డు కోసమో, వైట్ కాలర్ ప్రొఫైల్ కోసమో లేదా ఇంకేదైనా వ్యామోహంతోనో ఈ రంగంలోక రావాలని మాత్రం ఏ ఒక్కరూ ఆశపడవద్దు. సమాజానికి తమవంతు సేవ చేయాలనుకునే వారు మాత్రమే ఈ రంగంలో ఆర్ధికంగా ఎదగకపోయినా నలుగురికీ ఉపయోగపడతారని గుర్తుపెట్టుకుని మాత్రమే రండి.

అంతేగానీ, కేవలం ‘కార్డు’ కోసమో, ఇంకేదో గుర్తింపు కోసమో మా నుంచి అవకాశాలు ఆశించి మాత్రం దయచేసి దరఖాస్తులు పంపించవద్దని మనవి. తమ ప్రతిభను నిజాయితీగా నిరూపించుకునే ఆశయం, దానికి ప్రతిఫలంగా న్యాయబద్దంగా కాకపోయినా, కష్టానికి తగిన ఆదాయం ఆర్జించాలనుకునే వారు మాత్రమే తమ అర్హతలతో దరఖాస్తు పంపించగలరు.

ఆవిర్భవించిన అతితక్కువ కాలంలోనే చిన్న, మధ్యతరహా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ అవసరాలు తీరుస్తూ, వెబ్‌ మీడియా నిర్వాహకుల ఆదరాభిమానాలను చూరగొని విస్తరణ దిశగా అడుగులువేస్తున్న తెలుగు వార్తా సంస్థ ‘న్యూస్‌టైమ్’ ఏజెన్సీస్ వివిధ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

రిపోర్టింగ్, సబ్ ఎడిటింగ్, కాపీ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ట్రాన్సులేషన్, పేజినేషన్, యాడ్ డిజైనింగ్, డీటీపీ, న్యూస్ కంపోజింగ్, వెబ్ డిజైనింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, మార్కెటింగ్, అడ్మర్టయిజింగ్, న్యూస్ కో ఆర్డినేషన్, యాడ్ ప్రమోషన్, సోషల్ మీడియా తదితర విభాగాలలో పనిచేయాలన్న ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు తమ దరఖాస్తులను పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ఆన్‌లైన్‌లో https://newstime.in/application-for-new-joinings ద్వారా పంపించవలసి ఉంటుంది. ఇది వరకు పంపించిన వారు తమ అప్‌డేటెడ్ వివరాలతో మరోమారు పంపించాల్సి ఉంటుంది. (ఎంపిక అయిన వారు మళ్లీ అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదని గమనించాలి)

గతంలో అప్లికేషన్ పంపించి సాంకేతిక కారణాలు, లేదా సర్వర్ పనిచేయని కారణంగా ప్రాసెసింగ్ ఫీ చెల్లించని వారి అప్లికేషన్లను పరిశీలించడం జరగదని గమనించాలి. కేవలం వృత్తి విలువలపై ఆసక్తి కలిగిన వారు మాత్రమే దరఖాస్తులు పంపిస్తారన్న నమ్మకంతోనే ఈసారి నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీ పెట్టడం జరిగింది. ఏదో ఆకతాయితనంతో ఆన్‌లైన్‌లో అనంపూర్తిగా అప్లికేషన్ పంపించాలనుకునే వారికి అవకాశం ఇవ్వరాదన్న ఆశయంతో యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గుర్తించి ఔత్సాహికులు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారాన్ని ఉపయోగించుకుంటారని మనవి.

ఎంపికైన వారికి రూ. 15000 నుంచి రూ. 25000 మధ్య నెలవారీ జీతం చెల్లించడం జరుగుతుంది.

రిపోర్టింగ్ మినహా పైన పేర్కొన్న అన్ని విభాగాలలో ఎంపికైన వారు కేవలం పార్ట్‌టైమ్ ప్రాతిపదికన మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని గమనించాలి. కాపీ ఎడిటింగ్, ట్రాన్సులేషన్, పేజినేషన్, యాడ్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ రంగాల వారికి ఔట్‌సోర్సింగ్, వర్కు ఫ్రమ్ హోం సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఎంపికైన వారికి సంస్థ నియమ, నిబంధనలకు లోబడి జీతంతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా వంటి ఇతర అదనపు సదుపాయాలను ఉచితంగా కల్పించడం మినహా ఇతర ఎలాంటి అలవెన్సులను చెల్లించడం జరగదని గమనించాలి.

కేవలం ఆసక్తికలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేస్తారని ఆశిస్తున్నాము. కరోనా కష్టకాలంలో వివిధ కారణాల రీత్యా ఉపాధికి దూరమైన చాలా మంది సీనియర్లు ఇంటివద్దే ఉంటూ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేసుకునే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో వృత్తిపరమైన అనుభవం ఉన్న వారు దరఖాస్తులో ఆ విషయాన్ని ప్రత్యేకించి సూచించాలని మనవి.

ముఖ్య గమనిక… వృత్తిపరమైన విమర్శలు, ఏదైనా ఇతర కేసులలో ఆరోపణలు ఎదుర్కొనేవారూ దయచేసి దరఖాస్తుచేయవద్దని ప్రత్యేకించి తెలియజేస్తున్నాము.

ADVT